Friday, November 22, 2024

డికె తమ్ముడికి రూ. 593 కోట్ల ఆస్తులు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు రూరల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డికె సురేష్ రూ. 593 కోట్ల ఆస్తులను తన ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించారు. గడచిన ఐదేళ్లలో ఆయన ఆస్తులు 75 శాతం పెరిగినట్లు గురువారం ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం తెలుస్తోంది. ఐదేళ్ల క్రితం డికె సురేష్ ఆస్తుల విలువ రూ. 338 కోట్లు ఉండగా ఇప్పడవి రూ. 593 కోట్లకు పెరిగాయి. కాగా..డికె సురేష్ అప్పులు కూడా 188 శాతం పెరిగాయి. 2019లో రూ. 51 కోట్లు ఉన్న అప్పుటు ప్రస్తుతం రూ. 150 కోట్లకు పెరిగాయి. కర్నాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ సోదరుడైన డికె సురేష్ బెంగళూరు రూరల్ నియోజకవర్గం నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

బిజెపి అభ్యర్థి, ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ సిఎన్ మంజునాథ్‌ను ఢీకొంటున్నారు. చరాస్తుల విలువ పెరగడమే డికె సురేస్ ఆస్తులు పెరగడానికి కారణంగా తెలుస్తోంది. ఆయనకు వ్యవసాయ భూములు(చాలవరకు వారసత్వంగా సంక్రమించినవే), వ్యవసాయేతర ఆస్తులు, నివాస భవనాలు తన సొంత జిల్లా రామనగరంతోపాటు బెంగళూరులో ఉన్నాయి. ఐదేళ్ల క్రితం రూ. 305 కోట్లు ఉన్న ఈ ఆస్తులు ఇప్పడు రూ.486 కోట్లకు పెరిగాయి. సురేష్ చరాస్తులు కూడా గత ఐదేళ్లలో బాగా పెరిగాయి. 2019లో రూ. 33 కోట్లు ఉన్న చరాస్తుల విలువ ఇప్పుడు రూ. 106 కోట్లకు పెరిగింది. ఆయన అప్పుటు కూడా పెరిగాయి. రూ. 57.27 కోట్లు వివాదంలో ఉన్నాయని ఆయన ప్రకటించారు. అందులో రూ. 55.85 కోట్లు ఆదాయం పన్ను పరిధిలో ఉండగా రూ. 1.42 కోట్లు బెంగళూరులో ఆస్తి పన్ను ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News