నేడు గుజరాత్‌తో ఢీ
న్యూఢిల్లీ: ఐపిఎల్‌లో భాగంగా బుధవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగే పోరు ఢిల్లీ క్యాపిటల్స్‌కు చాలా కీలకంగా మారింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైన ఢిల్లీకి ఈ పోరు సవాల్‌గా తయారైంది. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ కేవలం మూడింటిలో మాత్రమే విజయం సాధించింది.
ఐదింటిలో ఓటమి పాలైంది. ఇలాంటి స్థితిలో నాకౌట్ రేసులో నిలవాలంటే ఇకపై జరిగే ప్రతి మ్యాచ్ కూడా ఢిల్లీకి కీలకమే. మరోవైపు గుజరాత్‌కు కూడా ఇది సవాల్ వంటిదే. గుజరాత్ 8 మ్యాచుల్లో నాలుగు విజయాలు సాధించింది. రన్‌రేట్ కూడా మైనస్‌లోనే ఉంది. ఇలాంటి స్థితిలో నాకౌట్ రేసులో నిలువాలంటే గుజరాత్ కూడా నిలకడైన విజయాలు సాధించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇరు జట్లకు కీలకంగా మారిన ఈ మ్యాచ్‌లో విజయం ఎవరికీ వరిస్తుందో వేచిచూడక తప్పదు.
బ్యాటింగే అసలు సమస్య..
గుజరాత్ టీమ్‌ను బ్యాటింగ్ సమస్య వెంటాడుతోంది. ఇతర జట్లతో పోల్చితే బ్యాటింగ్‌లో గుజరాత్ బలహీనంగా కనిపిస్తోంది. ఓపెనర్లు సాహా, శుభ్‌మన్ గిల్‌లు ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. గిల్ బ్యాటింగ్‌లో దూకుడు తగ్గింది. కెప్టెన్సీ ఒత్తిడితో అతను సహాజ శైలీలో బ్యాట్‌ను ఝులిపించలేక పోతున్నాడు. మిల్లర్ ఉన్నా ఫలితం లేకుండా పోతోంది. భారీ ఆశలు పెట్టుకున్న మిల్లర్ తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచడంలో విఫలమవుతున్నాడు. అతని వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపుతోంది.
సాయి సుదర్శన్, అజ్మతుల్లా, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్ వంటి విధ్వంసక బ్యాటర్లు జట్టులో ఉన్నా ఫలితం కనిపించడం లేదు. జట్టు బలహీనంగా ఉండడంతో స్వల్ప లక్ష్యాలను సయితం ఛేదించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొక తప్పడం లేదు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లోనైనా కీలక ఆటగాళ్లు తమ తమ బ్యాట్‌లకు పని చెప్పాల్సిన అవసరం ఉంది. లేకుంటే మరోసారి గుజరాత్‌కు ఇబ్బందులు తప్పక పోవచ్చు. ఇక సాయి కిశోర్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ తదితరులతో గుజరాత్ బౌలింగ్ చాలా బలంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే రెండు విభాగాల్లోనూ సమష్టిగా రాణిస్తేనే జట్టుకు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.
సవాల్ వంటిదే..
ఇక ఆతిథ్య ఢిల్లీకి ఈ మ్యాచ్ సవాల్‌గా తయారైంది. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీకి ఘోర పరాజయం ఎదురైంది. బౌలర్ల వైఫల్యంతో ఢిల్లీ అత్యంత చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. సన్‌రైజర్స్ ఓపెనర్లు హెడ్, అభిషేక్‌ల జోరుకు పవర్ ప్లేలో ఏకంగా 125 పరుగులు ఇచ్చుకుంది. కుల్దీప్ యాదవ్ తప్ప మిగతా బౌలర్లు ఈ మ్యాచ్‌లో విఫలమయ్యారు. ఇలాంటి స్థితిలో గుజరాత్‌తో జరిగే మ్యాచ్‌లో బౌలర్లు ఎలా రాణిస్తారనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. బ్యాటింగ్‌లోనూ ఢిల్లీ అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. యువ ఆటగాడు జాక్ ఫ్రెజర్ ఒక్కడే నిలకడగా రాణిస్తున్నాడు.
ఓపెనర్లు పృథ్వీషా, డేవిడ్ వార్నర్‌లు వరుస వైఫల్యాలు చవిచూస్తున్నారు. అభిషేక్ పొరెల్ ఫామ్‌లోకి రావడం జట్టుకు కాస్త ఊరట కలిగించే అంశంగా తయారైంది. కెప్టెన్ రిషబ్ పంత్ పర్వాలేదనిపిస్తున్నాడు. స్టబ్స్ ఒక మ్యాచ్‌లో రాణిస్తే మరోదాంట్లో విఫలమవుతున్నాడు. బ్యాటింగ్‌లో నిలకడ లోపించడం జట్టుకు ఇబ్బందిగా తయారైంది. బౌలింగ్‌లో కూడా ఢిల్లీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెండు విభాగాల్లో బలహీనంగా ఉండడంతో ఢిల్లీకి ఈ మ్యాచ్ కూడా సవాల్‌గా తయారైంది.