Thursday, January 23, 2025

విపక్షాలకు సహకరించడంలో డిఎంకె సర్వ ప్రయత్నాలు : స్టాలిన్

- Advertisement -
- Advertisement -

చెన్నై: 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి విపక్షాలకు సహకరించడంలో డిఎంకె హృదయపూర్వకంగా అన్ని చర్యలు తీసుకుంటుందని డిఎంకె అధినేత ,తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్పష్టం చేశారు. తమిళనాడుకు అత్యధిక పెట్టుబడులను ఆకర్షించడానికి తొమ్మిది రోజుల పాటు అధికారికంగా సింగపూర్, జపాన్‌లో పర్యటించిన స్టాలిన్ బుధవారం రాత్రి అరుదెంచారు.

ఈ సందర్భంగా పాత్రికేయులను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. మంత్రి వి. సెంధిల్ బాలాజీతో సంబంధం ఉన్న బంధువులు, ఇతర వ్యక్తుల ఇళ్లపై గత వారం సాగిన ఐటీ దాడులకు స్పందిస్తూ ఇంకమ్ టాక్స్, సిబిఐ, ఇడి వంటి దర్యాప్తు సంస్థలను విపక్షాలను భయపెట్టడానికి కేంద్రం లోని బీజేపీ ప్రయత్నిస్తుంటుందని, ఇతర రాష్ట్రాల్లో ఈమేరకు ఐటి, ఈడీ, సిబిఐ లను ఉపయోగించి ప్రతీకారం తీసుకోవడం లక్ష్యంగా పెట్టుకుందని, ఇక్కడ అలాగే ఇక ఐటి దాడులు ప్రారంభమయ్యాయని వ్యాఖ్యానించారు. గురువారం ఆప్ నేతలు ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్ , భగవంత్ మాన్‌లతో సమావేశం గురించి అడగ్గా ఇప్పటికే ఆ ప్రయత్నంలో ఉన్నామని తెలిపారు.

ఇదేం కొత్తకాదు. డిఎంకె హృదయ పూర్వకంగా ఇందులో భాగస్వామ్యం అవుతుందని చెప్పారు. కొత్త పార్లమెంట్ భవనంలో రాజదండం ప్రతిష్ఠించడం తమిళ ప్రజల గర్వకారణం కాదా అన్న ప్రశ్నకు నిజంగా అది చోళవంశీకులదే అయితే గర్వకారణమే అని వ్యాఖ్యానించారు. అయితే అదే సమయంలో మహిళా రెజ్లర్లపై దాడి చేయడం రాజదండం ప్రతిష్ఠను కించపరిచినట్టయిందని విమర్శించారు. రెండు దేశాల పర్యటనపై మాట్లాడుతూ రూ.3000 కోట్ల వరకు పెట్టుబడుల ప్రతిపాదనలపై సంతకాలు జరిగాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News