- Advertisement -
చెన్నై: హిందూ ఆలయాల్లో బాహ్మణేతర కులాలకు చెందిన 25మంది పూజారులను నియమిస్తూ తమిళనాడులోని డిఎంకె ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా శిక్షణ పొందిన పూజారులని తెలిపింది. మరో 34మంది శిక్షణ పొందిన అర్చకులకు కూడా నియామకపు ఉత్తర్వులిచ్చింది. డిఎంకె అధికారం చేపట్టి 100 రోజులైన సందర్భంగా శనివారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఈ ఉత్తర్వులిచ్చారు. బ్రాహ్మణేతరులను హిందూ ఆలయాల్లో పూజారులుగా నియమిస్తామంటూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా డిఎంకె మేనిఫెస్టోలో ఇచ్చిన హామీమేరకు స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 208 మందిని భట్టాచార్యులు, వొధువారులగానూ డిఎంకె ప్రభుత్వం నియమించింది. వీరిలో భట్టాచార్యులు వైష్ణవ ఆలయాల్లో, వొధువారులు శైవ ఆలయాల్లో ఆధ్యాత్మిక గీతాలు ఆలపిస్తారు.
- Advertisement -