Thursday, January 23, 2025

ఖుష్బూపై అనుచిత వ్యాఖ్యలు..

- Advertisement -
- Advertisement -

చెన్నై : తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి బీజేపీ నాయకురాలు ఖుష్బూపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డిఎంకెపార్టీ నేత శివాజీ కృష్ణమూర్తిపై ఆ పార్టీ అధిష్ఠానం కఠిన చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి ఆయనను బహిష్కరిస్తూ సీఎం స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. జనవరి నెల లోనూ శివాజీ తమిళనాడు గవర్నర్‌ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే . దీంతో అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు అప్పట్లో డిఎంకె ప్రకటించింది. అయినప్పటికీ, ఆయన ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తాజాగా డీఎంకె అధ్యక్షుడు స్టాలిన్ అతడిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఇటీవల నిర్వహించిన ఓ సమావేశంలో ఖుష్బూను ఉద్దేశిస్తూ శివాజీ కృష్ణమూర్తి అనుచిత వ్యాఖ్యలు చేయడం దుమారం చెలరేగింది.

ఈ వీడియోను ఆమె ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ సీఎం స్టాలిన్‌ను ట్యాగ్ చేశారు. శివాజీ తన పట్ల చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటుగా పేర్కొన్నారు. అవే కామెంట్స్‌ను మీ కుటుంబం లోని మహిళలకుఅంటే మీరు ఊరుకుంటారా అని ఆమె ఆవేదన వెలిబుచ్చారు. మీకు అర్థం కానిది ఏంటంటే … ఆయన కేవలం నన్నే కించపరచడం లేదు. మిమ్మల్ని, మీ తండ్రిగారి లాంటి గొప్ప నేతల్ని సైతం అవమానపరుస్తున్నారు. మీరు ఆయనకు ఎంత ఎక్కువ చనువు ఇస్తే , మీరు రాజకీయంగా అంత వెనుకబడిపోతారు. మీ పార్టీ అనైతిక వ్యక్తులకు స్వర్గథామంలా మారుతోంది. ఇది సిగ్గు చేటు. అంటూ ఖుష్బూ ట్వీట్ చేశారు. శివాజీ కృష్ణమూర్తి చేసిన తప్పే మళ్లీ చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అన్నారు. అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News