Friday, November 22, 2024

కెటిఆర్‌ను కలిసిన డిఎంకె ఎంపిలు

- Advertisement -
- Advertisement -

DMK MPs who met Minister KTR

నీట్ పరీక్ష రద్దుకు మద్దతు తెలపాలని కోరిన ఎంపిలు
సానుకూలంగా స్పందించిన మంత్రి

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ భవన్‌లో బుధవారం డిఎంకె ఎంపిలు టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌ను కలిశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీట్ పరీక్ష రద్దు అంశంపై సిఎం కెసిఆర్‌కు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ రాసిన లేఖను వారు కెటిఆర్ అందజేశారు. నీటి రద్దు కోరుతూ ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్టాలిన్ లేఖలు రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డిఎంకి ఎంపిలు ఎలెన్గోవన్, వీరస్వామిలు ఆ లేఖను అందజేశారు. కేంద్ర విధానాలపై నిరసన వ్యక్తం చేస్తున్నట్లు ఈ సందర్భంగా డిఎంకె ఎంపిలు పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని తమిళనాడు ప్రభుత్వం నీట్ పరీక్ష అంశంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోందని మంత్రి కెటిఆర్‌కు వివరించారు. కనీసం ఇలాంటి ముఖ్య విషయాల్లో కూడా కేంద్రం రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోవడం లేదని వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. విద్యావ్యవస్థలో రాష్ట్రాలకే ప్రాధాన్యం ఉండాలన్నదే తమ అభిమతమన్నారు. నీటిపై తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఎకె రాజన్ కమిటీ నివేదిక కూడా కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైనది కాదని ఏకీభవించిందని వారు వెల్లడించారు.ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలకు సిఎంకు స్టాలిన్ లేఖలు రాస్తూ…తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. దీనిపై మంత్రి కెటిఆర్ సానుకూలంగా స్పందించినట్లు వారు వెల్లడించారు. ఈ సమావేశంలో చేవెళ్ల ఎంపి రంజిత్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News