Monday, January 20, 2025

ఆకాశ వాణి పేరుపై డిఎంకె అభ్యంతరం..

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఆల్ ఇండియా రేడియోకు బదులుగా ఆకాశవాణి అని పిలవాలని ప్రసార భారతి తీసుకన్న నిర్ణయాన్ని తమిళనాడులోని అధికార డిఎంకె అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈమేరకు కేంద్ర ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ కు డిఎంకె ఎంపీ టీఆర్ బాలు లేఖ రాశారు. ఇంగ్లీష్ ప్రసారాల సమయంలో కూడా దిస్ ఈజ్ ఆల్ ఇండియా రేడియో అని కాకుండా దిస్ ఈజ్ ఆకాశవాణి అని మాత్రమే పలకాలని ఆకాశ వాని డీజీ వసుధా గుప్తా ఉత్తర్వులు జారీ చేయడాన్ని డిఎంకె తప్పు పట్టింది.

ప్రసార భారతి నిర్ణయానికి వ్యతిరేకంగా కమిళనాడు లో అనేక పార్టీలు, ప్రజలు ఆందోళన చేపట్టారు. తమిళనాడు లోని రేడియో కేంద్రాలు ఆకాశవాణిని వానోలి అని పలుకుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఆకాశ వాణికి బదులు ఆల్ ఇండియా రేడియోనే వినియోగించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News