చెన్నై: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి, డిఎంకె నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై చెలరేగుతున్న దుమారం చల్లారకముందే మరో డిఎంకె నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి ఎ రాజా కొత్త వివాదానికి తెరతీశారు. సనాతన ధర్మాన్ని హైచ్‌ఐవి, కుష్ఠు వ్యాధితో ఆయన పోల్చారు.
గుఉరవారం ఒక కార్యక్రమంలో రాజా ప్రసంగిస్తూ సనాతన ధర్మాన్ని ఉదయనిధి స్టాలిన్ ఎంతో సున్నితంగా మలేరియా, డెంగీ వంటి వ్యాధులతో పోల్చారని చెప్పారే. సనాతన ధర్మాన్ని సమాజం నుంచి నిర్మూలించాలని ఆయన పిలుపునిచ్చారని రాజా చెప్పారు. అయితే తాను మాత్రం దాన్ని హెచ్‌ఐవి లేదా కుష్ఠు వ్యాధితో పోలుస్తానదాన్ని సామాజిక దురాగత వ్యాధిగా చూస్తానని ఆయన చెప్పారు. ఈ అంశంపై తనతో బహిరంగ చర్చకు రావాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఆయన సవాల్ విసిరారు.
శంకరాచార్యులు, పండితులతోపాటు 10 లక్షల మంది లేదా 1 కోటి మంది మద్దతుదారులతో, అన్ని ఆయుధాలతో సనాతన ధర్మంపై ఢిల్లీలో చర్చకు మీరు రండి&పెరియా, అంబేద్కర్ రాసిన పుస్తకాలే ఆయుధాలుగా నేను చర్చకు వస్తాను.. ఎప్పుడో తేదీ చెప్పండి..రావడానికి నేను సిద్ధం అంటూ రాజా సవాలు చేశారు.
సనాతన ధర్మం హెచ్ఐవితో సమానం: మాజీ కేంద్ర మంత్రి ఎ రాజా
- Advertisement -
- Advertisement -
- Advertisement -