Thursday, April 3, 2025

2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో డిఎంకె పొత్తు కొనసాగుతుంది: స్టాలిన్

- Advertisement -
- Advertisement -

MK Stalin

చెన్నై: అధికారంలో ఉన్న బిజెపితో పొత్తు అనేదే ఉండదని, తమిళనాడులో తమ పార్టీ కాంగ్రెస్, వామపక్షాల కూటమితో కలిసి 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీపడుతుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ పేర్కొన్నారు. బిజెపిని వ్యతిరేకించే పార్టీలన్నీ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. తాను ప్రధాని పదవికి పోటీపడబోనని, తన స్థాయి ఏమిటో తనకు తెలుసునని స్టాలిన్ స్పష్టం చేశారు. ఒక ప్రశ్నకు సమాధానంగా బిజెపితో తమ పార్టీ ఏమూత్రమూ రాజీపడదని అన్నారు. 2024లో తాము తమిళనాడు, పుదుచ్చేరిలోని అన్ని సీట్లను గెలిచేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. కేంద్రంలో బిజెపికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావలసి ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News