Thursday, December 19, 2024

తగవుల ‘సై’

- Advertisement -
- Advertisement -

నేనెప్పుడు అవమానింపబడలేదు. అయితే వేరే రాష్ట్రంలో తమ సోదరి అగౌరవానికి గురైతే తమిళనాడులో ఈ విధంగా కొందరు సంతోషించడం, స్పందించడం భావ్యమేనా? ఇది సరైన ఆలోచనా విధానం కాదు.
మురసొలి తొలి ఆర్టికల్‌పై
                                                                                                               తమిళిసై వ్యాఖ్య

రాష్ట్ర గవర్నర్ తమిళిసైపై డిఎంకె అధికారిక
పత్రిక మురసొలి తీవ్ర విమర్శలు

చెన్నై: తెలంగాణ గవర్నర్ తమిళిసై వ్యవహారశైలి అనుచితంగా, అప్రతిభాయుతంగా ఉందని తమిళనాడులోని అధికార డిఎంకె పార్టీ తీవ్రంగా విమర్శించింది. ఆమె ధోరణి ప్రజాజీవితంలో ఆమె అనుభవరాహిత్యానికి అద్దం పడుతోందని పేర్కొన్న డిఎంకె ఆమె వ్యక్తం చేసిన ధీర తమిళవనితను అనే వ్యాఖ్యలు ఏ కోశానా సరిపోనివని పే ర్కొంది. డిఎంకె అధికార పత్రిక ‘మురసొలి’లో తాజాగా తమిళిసై వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఘాటైన పదజాలంతో బుధవారం వ్యా సం వెలువరించిందని పిటిఐ వార్తా సంస్థ ప్రత్యేక కథనాన్ని ఇచ్చింది. ఆమె ధైర్యశాలి అయితే, తెలంగాణ వీడి తమిళనాడుకు వచ్చి తనను తాను సమర్థించుకుంటారా? అని మురసొలిప్రశ్నించినట్లు తెలిపిం ది. పిటిఐ కథనం ప్రకారం ఆమె చెబుతున్న తమిళ వీరవనితల లక్ష ణం తమిళుల జీవనపథంలోనే లేదని ఆ పత్రిక ఘాటుగా పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం తనను నిర్లక్షం చేస్తోందని, ఇది ఆడపడుచుల పట్ల ప్రదర్శించే లక్షణమేనా అని ఇటీవల తమిళిసై ఆరోపించారు.

తెలంగాణ గౌరవ మహిళా గవర్నర్‌ను తాము ఎప్పటికప్పుడు ఆదరించినా, ఇందుకు భిన్నంగా ఆమె రాజ్‌భవన్‌ను రాజకీయ రచ్చల వేదికగా చేసుకోవడం తగునా అని టిఆర్‌ఎస్ పేర్కొన డం వంటి అంశాల నేపథ్యంలో తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకె స్పందించింది. పులిని తరిమిన తమిళ యువతి తరహా తనది అని తమిళిసై చెప్పడం విడ్డూరంగా ఉందని, భ్రాంతిలో నివసించే వారి తత్వం అని డిఎంకె విమర్శించింది. తాను ధైర్యవంతురాలిని అని ఆమె తెలంగాణ వీడి తమిళనాడుకు వచ్చి గొప్పలు చెప్పడం ఎంతవరకు సబబు? అని ప్రశ్నించారు. ఇక్కడికి పారిపోయి వచ్చిన ఆమె తన వైఖరి గురించి తానే తెలియచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రెండు రోజుల క్రితమే గవర్నర్ తమిళిసై వ్యవహారశైలిపై మురసొలి పత్రికలో ఓ రాజకీయ విశ్లేషణాభరిత వార్త వచ్చింది. రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రజా ప్రభుత్వాలపై గవర్నర్ల సై కయ్ వంటి ధోరణి తగవులమారి వైఖరిలను తిట్టిపోస్తూ ఈ పత్రికలో చెండాడారు.

ఈ వ్యాసంపై గవర్నర్ తమిళిసై స్పందించారు. తాను ఎప్పుడూ అవమానింపబడలేదని, అయితే వేరే రాష్ట్రంలో తమ సోదరి అగౌరవానికి గురైతే తమిళనాడులో ఈ విధంగా కొందరు సంతోషించడం స్పందించడం భావ్యమేనా అని గవర్నర్ ప్రశ్నించారు. ఇది సరైన ఆలోచనా విధానం కాదని మురసొలి తొలి ఆర్టికల్‌పై తమిళిసై వ్యాఖ్యానించారు. ఆమె మాటలకు ప్రతిస్పందనగా డిఎంకె పత్రిక బుధవారం తిరిగి రంగంలోకి దిగింది. ఆమె హైదరాబాద్‌లో అవమానానికి గురైనట్లు తాము ఎక్కడా తెలియచేయలేదని, ఆమెనే కావాలనే భుజాలు తడుముకోవడం, అవమానానికి గురి కాలేదని అనడం, తరువాత అగౌవరపర్చారని చెప్పడం ఇవన్నీ ఆమె పరిణతి చెందని వైఖరికి నిదర్శనం అనుకోవాలా? అని మురసోలి అక్షరం ధట్టించింది.

ఆమె తాను అవమానానికి గురైనట్లు తెలిపే వ్యాఖ్యలతో ఉన్న యూట్యూబ్ వీడియోలోని అంశాలను ఈ సందర్భంగా డిఎంకె ప్రస్తావించింది. తనంతతానుగా ఆమె అవమానానికి గురయినట్లు తెలిపిందని, కాదంటోందని , పైగా ఇక్కడికి వచ్చి తన గురించి తెలియచేసుకొంటోందని మురసోలి రాసింది. గవర్నర్ పదవిని తమిళిసై చాలా అత్యున్నత పదవి అనుకుంటున్నారు. అయితే ఇది నియామక పదవి, అని పేర్కొంటూ లాంఛనప్రాయకమైన హోదా అని తెలిపింది. ఎన్నికైన ప్రజా ప్రభుత్వాలకు ఇబ్బంది పెట్టకుండా గవర్నర్లు ఉండాలనే అంశాన్ని తీసుకునే రాజ్యాంగ కర్తలైన మేధావులు గవర్నర్లకు విస్తృతాధికారాలు ఇవ్వలేదని వివరించారు.

తెలంగాణ పరిణామాల ప్రస్తావన

తెలంగాణలో ఇప్పటి గవర్నర్ వ్యవహారశైలిని ఇప్పుడు తిరిగి మురసోలి పత్రిక ప్రస్తావించింది. గవర్నర్ పదవికి నియుక్తులు అయిన వారు తిరోగమపథంలో వెళ్లితే ఫలితం కూడా వారికి అదే విధంగా తగులుతుందని వ్యాఖ్యానించింది. వారు అనుసరించే మార్గాన్ని బట్టి వారికి చెడు మంచి ఫలితాలు వస్తాయని తెలిపింది. ఆమె తెలివితక్కువతనపు ధోరణి , అనుభవరహిత వైఖరి , పిల్లచేష్టలు ఆమె ఇచ్చే కొన్ని మీడియా ఇంటర్వూలతో, వ్యాఖ్యలతోనే స్పష్టం అవుతోందని సౌందరరాజన్‌పై విరుచుకుపడ్డారు. ఆమె తెలంగాణలో మంచి పేరు తెచ్చుకుంటే ఆమెకు తప్పనిసరిగా ప్రశంసలు దక్కుతాయి. దక్కితీరుతాయి, అయితే ఆమె తలపడే తగవుల బాట పట్టినట్లుగా స్పష్టం అవుతోందని తెలిపారు. తమిళుల సంస్కృతి గురించి ఇక్కడ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తమిళనాడు తీరు గురించి ప్రస్తావించకుండానే అంతా తెలుసుకోవచ్చు. అంతా మెచ్చుకునే వారిని తమిళులు గౌరవిస్తారు. ఇదే ఇక్కడి పద్ధతి . అదే రాళ్లు విసిరే పద్ధతిలో ఉండే వారికి బుద్ధిచెప్పడం, చక్కగా ఉండాలని తెలియచేయడం ఇక్కడి వారి ధర్మం , జీవనరీతి అని మురసోలి వ్యాఖ్యానించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News