Saturday, November 23, 2024

జూలై 6న చలో మానుకోట జయప్రదం చేయండి

- Advertisement -
- Advertisement -

మరిపెడ: జూలై 6వ తేదీన నిర్వహించనున్న తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం మానుకోట జిల్లా మహాసభను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు పేరం వీరస్వామి అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో సంఘం మండల అధ్యక్షులు కట్టా రవీందర్ ఆధ్వర్యంలో నాయకులతో కలిసి చలో మానుకోట పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటికి ఊరికి ఆమడ దూరంలో ఉంటూ వలసలు పోతూ ఆర్ధికంగా వెనుకబడి ఉన్నామన్నారు.

ఆర్టికల్ 3 ప్రకారం పందుల పెంపకందారులకు శాస్త్రీయ పద్ధతుల్లో ప్రభుత్వం లోన్లు ఇవ్వాలని, డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వాలన్నారు. జనాభా దమాషా ప్రకారం ఎరుకలను గుర్తించి సముచిత స్ధానం కల్పించాలని, రాజకీయకంగా మా కులస్తులను గుర్తించాలన్నారు. ఎరుకలకు గిరిజన బంధు ప్రకటించి ఆర్ధికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర జనాభా ప్రకారం మా వాటా ఎంతో తేల్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఎరుకల సంఘం హక్కుల సాధన కోసం సంఘం రాష్ట్ర అధ్యక్షులు కూతాడి కుమార్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జూలై 6న నిర్వహించే భారీ బహిరంగ సభ ఎరుకల సంఘ నాయకులు, సభ్యులు, పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎరుకల సంఘం మండల అధ్యక్షులు కట్టా రవీందర్, జిల్లా సహాయ కార్యదర్శి ప్రశాంత్, జిల్లా యూత్ ఉపాధ్యక్షులు కట్టా నవీన్, మండల ప్రధాన కార్యదర్శి అంగడి రమేష్, నాయకులు వెంకన్న, శ్రీరాములు,

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News