Thursday, January 23, 2025

నిజాయితీగా వ్యాపారం చేయండి… లేదంటే చర్యలు తప్పవు

- Advertisement -
- Advertisement -
  • వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్

హసన్‌పర్తి: నిజాయితీగా వ్యాపారం చేయండి.. లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ పాత ఇనుప సామాను కొనుగోలు వ్యాపార్థులు, ఆటో కన్సల్టెన్సీ యాజమాన్యానికి సూచించారు. కమిషనరేట్ పరిధిలో వాహన చోరీల నియంత్రణకై తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ట్రై సిటీ పరిధిలోని పాత సామాను కొనుగోలు వ్యాపారస్థులతో పాటు ఆటో కన్సల్టెన్సీ నిర్వహకులతో గురువారం భీమారంలోని శుభం కల్యాణ వేదికలో పోలీస్ కమిషనర్ సమావేశాన్ని ఏర్పాటుచేశారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ చోరీకి గురైన ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయడం ద్వారా సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు జరిగే నష్టంతోపాటు దేశానికి ఏవిధంగా నష్టం వాటిల్లుతుందో వ్యాపారస్థులకు వివరించారు.

డబ్బు సంపాదనే లక్షంగా చోరీకి గురైన వామనాల కొనుగోలు చేయడం సరికాదని, నిబంధనలు పాటిస్తూ వ్యాపారం నిర్వహించుకోవాలని, మధ్య తరగతి ప్రజలు అధికంగా వినియోగించే ద్విచక్ర వాహనాలను దొంగల నుంచి కొనుగోలు చేసి వాటిని తుక్కు రూపంలో తరలించడం మానుకోవాలని, పాత ఇనుప సామాను, సెకండ్ హ్యాండ్ వాహన విక్రయదారులు ఏదైనా వాహనం కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా వాహనం విక్రయించే వ్యక్తులకు సంబంధించి ఆధార్ కార్డు లాంటి గుర్తింపు కార్డులతోపాటు వారి సెల్‌ఫోన్ నంబరు తీసుకోవాలన్నారు.

వాహనం కొనుగోలు చేసే సమయంలోనే వారికి ఫోన్ చేసి నిజ నిర్దారణ చేసుకోవాలని, వాహనాల క్రయ విక్రయాలకు సంబంధించి మార్గదర్శకాలు పాటిస్తూ రికార్డులను రూపొందించుకోవాలని, ఒరిజినల్ పత్రాలు ఉంటే వాహనాలను కొనుగోలు చేయాలని, ప్రతీ వ్యాపార కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటుచేసుకోవాలని, ఎవరైనా వ్యాపారస్థులు చట్ట వ్యతిరేకంగా వాహన కొనుగోళ్లకు పాల్పడితే ఒకటి రెండు మార్లు మినహాయింపు ఇవ్వబడుతుందని, లేదంటే వ్యాపారస్లుపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామన్నారు.

నిజాయితీగా వ్యాపారం నిర్వహించుకుంటే పోలీసుల వేధింపులు ఉండవన్నారు. ఈ సమావేశంలో క్రైం డీసీపీ దాసరి మురళీధర్, ఏసీపీలు మల్లయ్య, రమేశ్‌కుమార్, కిరణ్‌కుమార్, డేవిడ్‌రాజు, సతీష్‌బాబుతోపాటు ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News