Monday, November 18, 2024

రివర్షన్ విద్యుత్ ఉద్యోగులకు న్యాయం చేయండి

- Advertisement -
- Advertisement -

భట్టికి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే కూనం నేని

మన తెలంగాణ / హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థల్లో అన్యాయానికి గురైన విద్యుత్ ఇంజనీర్లకు న్యాయం చేయాలని సిపిఐ ఎంఎల్‌ఏ, కాంగ్రెస్ పార్టీ మిత్ర పక్షం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి భట్టి విక్రమార్కను కోరుతూ వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ విద్యుత్ సంస్థల్లో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విద్యుత్ ఉత్పత్తిలోనే కాకుండా విద్యుత్ వినియోగదారులకు నిరంతర విద్యుత్ సఫరాకోసం ఆహర్నిశలు కష్టపడ్డ వారికి గత పాలకుల చేతిలో అన్యాయం జరిగిందని, దానిని సరి చేసి డిమోషన్ చేసిన విద్యుత్ ఇంజనీర్లకు తిరిగి పదోన్నతి కల్పించాలని సాంబశివరావు మంత్రికి వివరించారు.  ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శనివారం మంత్రిని ఆయన నివాసంలో కలిసి విద్యుత్ ఇంజనీర్ల రివర్షన్‌కు సంబంధించిన విషయంపై వినతి పత్రం ఇచ్చి పూర్తిగా వివరించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఏపీ కి చెందిన విద్యుత్ ఇంజనీర్లకు అక్కడికి పంపిన తర్వాత ఇక్కడ ఉన్న వారికి పదోన్నతులు కల్పించారని, ఏడేనిమిది సంవత్సరాలు పని చేసిన తర్వాత వారిని డిమోషన్ చేస్తు అది రివర్షన్ ఇచ్చారని, ఏడేనిమిది సంవత్సరాలు ఉన్నత స్థానంలో పని చేసిన వారు తిరిగి కింది క్యాడర్లో పని చేయడం సాధ్యం కాదనే విషయాన్ని మంత్రికి వివరించారు. విద్యుత్ ఇంజనీర్లకు రివర్షన్ చేయడం న్యాయ సూత్రాలకు విరుద్ధమని మంత్రికి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యుత్ ఇంజనీర్ల పోరాటం మరవలేనిదని తెలిపారు. రివర్షన్ చేసిన ఇంజనీర్లను వారి వాస్తవ 1 పోస్టుల్లో కి తిరిగి పదోన్నతులు కల్పించాలన్నారు. అవసరమైతే అడిషనల్ పోస్టులు ఏర్పాటు చేయాలని, తెలంగాణ కోసం పోరాడిన విద్యుత్ ఇంజనీర్లకు న్యాయం చేయాలని ఆయన మంత్రికి తెలిపారు. విద్యుత్ ఇంజనీర్లకు సంబంధించిన పూర్తి వివరాలను తాను స్వయంగా పరిశీలిస్తానని. సాధ్యమైనంత వరకు వారికి న్యాయం చేద్దామని ఎంఎల్‌ఏకు డిప్యూటి సిఎం, విద్యుత్‌శాఖ మంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News