Wednesday, January 22, 2025

విద్యుత్ పోస్టింగుల్లో బిసి ఇంజనీర్లకు న్యాయం చేయండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలైన ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎస్‌పిడిసిఎల్, ఎన్‌పి డిసిఎల్‌లలోని పోస్టింగ్‌లలో బిసి ఇంజనీర్లకు న్యాయం చేయాలని బిసి కమిషన్ ఛైర్మన్ వకుళా భరణం కృష్ణమోహన్ రావుకు తెలంగాణ బ్యాక్‌వర్డ్ క్లాస్ ఇంజనీర్స్ ఫెడరేషన్ విజ్ఞప్తి చేసింది. గురువారం ఈ మేరకు ఫెడరేషన్ ప్రసిడెంట్ దేవల్ల సమ్మయ్య, సెక్రటరీ జనరల్ సతీష్ కోటే లు వకుళాభరణంను కలసి ఒక వినతి పత్రం అందజేశారు. సంస్థలోని ఉన్నతస్థాయి పోస్టుల్లో బిసి ఇంజనీర్లకు ప్రాధాన్యతను ఇవ్వడం లేదని వారు ఫిర్యాదు చేశారు. ప్రధానంగా టిఎస్ ఎస్‌పిడిసిఎల్‌లో సిఎండి, 5 గురు డైరెక్టర్లు ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా మిగిలిన ముగ్గురు డైరెక్టర్లలో ఇద్దరు మాత్రమే బీసిలుఉన్నారన్నారు. తెలంగాణలో ఉన్న బిసి సామాజిక వర్గ విద్యుత్ ఇంజనీర్లకు ఇక నైనా న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News