Sunday, April 6, 2025

రోహిత్‌పై వేటు పడిందా..? అనుమానంలో ఫ్యాన్స్

- Advertisement -
- Advertisement -

లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఏ ఆటగాడు ఎప్పుడు అద్భుతంగా ప్రదర్శన చేస్తాడో ఎవరికీ తెలియదు. తనకు పరిస్థితులు అనుకూలిస్తే.. ఆ సందర్భంలో ఏ ఆటగాడైనా రాణిస్తాడు. దీనికి సీనియారిటీతో సంబంధం లేదు. కానీ, కొన్ని సందర్భాల్లో మాత్రం ఆటగాడు సరిగ్గా ఆడకపోతే.. వాళ్లని జట్టు నుంచి తొలగించి.. ఆ స్థానంలో కొత్త వారికి చోటు కల్పిస్తారు. ఇప్పుడు ముంబై ఇండియన్స్‌కు ఐదు సార్లు టైటిల్‌ను అందించిన రోహిత్ శర్మకు అదే పరిస్థితి ఎదురైనట్లు కనిపిస్తోంది.

గత ఏడాది రోహిత్ స్థానంలో హార్థిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా నియమించిన విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్‌లో జట్టు లీగ్ స్టేజీకే పరిమితమైంది. దీంతో రోహిత్‌ని కెప్టెన్సీ నుంచి తొలగించినందుకు ఫ్రాంచైజీపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఇప్పుడు రోహిత్‌ని జట్టులో నుంచే తీసేసినట్లు వార్తలు పుట్టుకొస్తున్నాయి. 2025 ఐపిఎల్‌లో రోహిత్ అంతగా ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఆడిన మూడు మ్యాచుల్లో 0,8,13 పరుగులు చేశాడు.

ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించినా.. అతని బ్యాటింగ్‌లో మాత్రం మార్పు లేదు. దీంతో లక్నోతో జరిగిన మ్యాచ్‌లో అతన్ని పక్కన పెట్టారు. మోకాలి గాయమైందని జట్టు వర్గాలు చెప్పాయి. మరి రోహిత్‌కి నిజంగానే గాయమైందా.. లేక.. పూర్తిగా అతన్ని జట్టు నుంచి పక్కన పెట్టారా.. అని ఫ్యాన్స్ అనుమాన పడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News