Saturday, November 23, 2024

ఒమిక్రాన్ భయం వద్దు

- Advertisement -
- Advertisement -

Do not be afraid of Omicron:Harish rao

ప్రాణాంతకం కాదు, మాస్క్, టీకాలు తప్పనిసరి : మంత్రి హరీశ్‌రావు భరోసా.

రాష్ట్రంలో 2 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు ప్రకటన

మన తెలంగాణ / సిద్దిపేట: ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి, కరోనా టీకా రెండు డోసులు అందరు తీసుకోవాలని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నరు. బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోలోని 27 వార్డులో గణేశ్ నగర్‌లో రూ. 15 లక్షల రూపాయలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయానని, అయిన భయం వద్దన్నారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలన్నారు. కరోనా టీకాలు రెండవ డోస్ కూడా అందరు తప్పనిసరిగా వేసుకోవాలన్నారు. గర్భిణీలు కరోనా టీకాలుతీసుకోవద్దనే అపోహలు వద్దని అందరూ తీసుకోవచ్చునని వైద్యులే చెబుతున్నారని ప్రజలకు అవగాహన కల్పిస్తూ మీరు కోరితే మీ ఇంటింటికి వచ్చి కరోనా టీకాలు వేయిస్తామన్నారు. ప్రజా ప్రయోజనార్ధం ప్రజల మనస్సులో ఉన్నది నేరవేర్చడమే మా ప్రయత్నం అని పేర్కోన్నారు. గణేశ్ నగర్ మహిళా భవన నిర్మాణం పదేళ్ల పంచాయతీ ఇవాళ్టితో నేరవేరిందన్నారు.

అదనంగా కాంపౌండ్ వాల్ కోసం కావల్సిన నిధులు , 6వ వార్డులో మహిళా భవనం మరమ్మత్తులకు అవసరమైన నిధులు సమకూర్చి మూడు నెలల్లో పూర్తి చేస్తామని ఆయా వార్డు ప్రజలకు మాట ఇచ్చారు. వార్డుల్లో యూజీడీ పనులు వెంటనే చేయించాలని అధికారులను ఆదేశిస్తూ నల్లా నీళ్ల తరహాలో ఇంటింటికి గ్యాస్‌కనెక్షన్ ఇచ్చేలా గ్యాస్ పైపు లైన్లు వేయిస్తున్నామన్నారు. తొందరగా పైపులైన్ పనులు పూర్తి చేయించి రోడ్డు వేసుకుందామని ప్రజలకు వివరించారు. యూజీడీ కోసం ప్రజలు సహకరించాలని దీంతో దోమలు, ఈగలు రోగాలు రాకుండా ఉంటాయని తెలిపారు. ఇంటింటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్ త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు పట్టణంలో పందులు, కోతులు, కుక్కుల బేడద తప్పిందని సురక్షిత సిద్దిపేట కోసం పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఆరోగ్య సిద్దిపేట కోసం అభివృద్ది పనులు చేస్తున్నామని, ప్లాస్టిక్ రహిత సిద్దిపేట దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రజలంతా ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని స్టీల్ బ్యాంకులు వినియోగించుకోవాలన్నారు.స్వంత స్థలంలో ఇల్లు కట్టుకునే అవకాశం త్వరలోనే కల్పిస్తామని చెప్పారు. తడి, పోడి హానికరమైన చెత్తలను వేరువేరుగా ఇచ్చి స్వచ్చ సిద్దిపేటకు సహకరించాలన్నారు. స్వచ్చబడికి పోవాలని అక్కడ చెత్త ద్వారా ఎరువు తయారు చేసే విధానం చెత్తతో అనర్ధాలు, ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్ధాలు వివరిస్తారని ప్రజలు అవగాహన పొంది స్వచ్చ సిద్దిపేటకు సహకారాన్ని అందించాలన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News