Monday, December 23, 2024

ఆ లింక్ పైన క్లిక్ చేయకండి… బ్యాంక్ కస్టమర్లకు హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

బ్యాంక్ కస్టమర్లను హెచ్చరించిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్

HDFC to be merged with HDFC Bank

న్యూఢిల్లీ : డిజిటల్ బ్యాంకింగ్ పెరగడంతో పాటు మోసాల కేసులు(సైబర్ ఫ్రాడ్) కూడా పెరుగుతున్నాయి. దీంతో చాలా బ్యాంకులు తమ ఖాతాదారులకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటాయి. తాజాగా దేశంలోని అతిపెద్ద ప్రైవేట్‌రంగ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తన కస్టమర్లకు ఈ మోసాలపై హెచ్చరికలు జారీ చేసింది. కొంతకాలంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు పాన్ కార్డ్ అప్‌డేట్, కెవైసి వంటి మెసేజ్‌లు పంపుతున్నారు. ఈ మెసేజ్‌లపై స్పందించిన బ్యాంక్ ఇవన్నీ ఫేక్ మెసేజ్‌లని స్పష్టం చేసింది. అలాంటి మెసేజ్‌లపై కస్టమర్లు దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని పేర్కొంది.
ఈ చిట్కాలతో సైబర్ నేరాలను నివారించండి
1. ఎస్‌ఎంఎస్ ద్వారా పంపిన లింక్ యుఆర్‌ఎల్‌ని పూర్తిగా తనిఖీ చేయండి.
2. అధికారిక పేజీలో మాత్రమే నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి, పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి.
3. నెట్ బ్యాంకింగ్ సమాచారాన్ని నమోదు చేస్తున్న పేజీలో https:// ఉండాలి. ఇందులో s అంటే సురక్షితం. ఇది https://తో ప్రారంభం కాకపోతే సమాచారాన్ని నమోదు చేసే ముందు జాగ్రత్త వహించాలి.
4. టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసే ముందు అధికారిక వెబ్‌సైట్‌లోని నంబర్‌ను క్రాస్ చెక్ చేయండి.
5. మీ కంప్యూటర్‌లో యాంటీ-వైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఎల్లప్పుడూ అప్‌డేట్ చేస్తూ ఉండండి.
6. ఎల్లప్పుడూ మీ క్రెడిట్, డెబిట్ కార్డ్, బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్‌లను తనిఖీ చేస్తూ ఉండండి.
7. ఇమెయిల్ లేదా మెసేజ్ ద్వారా పాన్ ఆధార్ సమాచారాన్ని అప్‌డేట్ చేయమని బ్యాంక్ ఎట్టి పరిస్థితుల్లోనూ సలహా ఇవ్వదని గుర్తుంచుకోండి.
8. ఏదైనా కాల్ లేదా మెసేజ్‌పై అనుమానం ఉంటే, వెంటనే బ్యాంక్‌కి కాల్ చేయడం ద్వారా క్రాస్ వెరిఫై చేయండి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News