అమరావతి: సడలింపు సమయంలోనూ అనవసరంగా బయటకు రావొద్దని సిపి అంజనీకుమార్ హెచ్చరించారు. మాస్క్ లేకున్నా, భౌతిక దూరం పాటించుకున్నా కేసు నమోదు చేస్తామని సిపి పేర్కొన్నారు. ఈ నెల 12 నుంచి నిన్నటి వరకు లక్షా 65 వేల కేసులు బుక్ చేశామని, లాక్డౌన్ అమలులోకి వచ్చిన తరువాత కొత్త నిబంధనలు ప్రకారం ప్రజలు నడుచుకోవాలని సూచించారు. అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారిపై చర్యలు తప్పవన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు ఇళ్లకు చేరేందుకు సమయం ఉంటుందన్నారు. ఎక్కడికక్కడ పోలీస్ చెక్‌పోస్టులు, తనిఖీలు చేస్తామన్నారు. ఒంటి గంట తరువాత షాపులు, సంస్థలు మూతపడ్డాయి. మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రజలు ఇంటికి చేరేందుకు అనుమతి ఉంటుందన్నారు. అనవసరంగా రోడ్ల మీదకు వచ్చే వారికి భారీ జరిమానాలు ఉంటాయని హెచ్చరించారు. కేసులు, వాహనాలు సీజ్ తప్పదన్నారు. లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తామన్నారు.
అనవసరంగా బయటకు రావొద్దు: సిపి అంజనీకుమార్
- Advertisement -
- Advertisement -
- Advertisement -