Thursday, November 14, 2024

లంపస్కిన్ వ్యాధి పశువులపాలు తాగొద్దు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  లంపస్కిన్ వ్యాధికి గురైన పశువుల పాలు తాగవద్దని పశువైద్యాధికారులు సూచిస్తున్నారు. అయితే ఈ పశువుల పాలను వినియోగించటం వల్ల అంతగా ప్రమాదమేది ఉండదని , ఇటువంటి పశువుల ద్వారా వచ్చే పాలను తాగకపోవటమే మేలని చెబుతున్నారు. లంపస్కిన్ వ్యాధి నివారణ కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రంలో ఆవులతోపాటు గేదెలకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని హెచ్చరిస్తున్నారు. లంపస్కిన్ వ్యాధి గురించి రైతులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైరస్ సోకిన ప్రాంతాల్లో ప్రజలు భయపడాల్సిన పనిలేదిని రైతులకు ధైర్యం చెబుతున్నారు.

ఆవు పాలను వేడి చేసుకుని తాగటం మంచిదని పశువైద్యాధికారి డా.వెంకటేశ్వర్లు వెల్లడించారు. వైరస్‌ను అరికట్టడానికి ఆవుజాతి పశువులు నివసించే ప్రదేశాల్లో బయోసేఫ్టి పద్దతులు పాటించాలన్నారు. వ్యాధి లక్షణాలు గుర్తించిన వెంటనే పశువును మందనుంచి వేరుగాఉంచి మేత, నీరు ,తగిన చికిత్సలు అందించాలని తెలిపారు. ముందస్తుగా గేదెలు, ఆవులు నాలుగు నెలల వయసు దాటిన దూడలు ,దున్నలు ,కోడెలు , ఎద్దులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని తెలిపారు. వ్యాధి సోకిన పశువును గుర్తించి పశువైద్యుసిబ్బందికి సమాచారం అందజేయాలని తెలిపారు. దద్దులు వచ్చినా, గాయాలైనా , చికిత్సలు చేయించాలని డా.వెంకటేశ్వర్లు రైతులకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News