Thursday, January 23, 2025

మద్యం మత్తులో వాహనాలు నడుపొద్దు

- Advertisement -
- Advertisement -

లక్ష్మణచాంద : మద్యం మత్తులో వాహనాలు నడిపి మనం ప్రమాదంలో పడడంతో పాటు ఇతరులను ప్రమాదంలో నెట్టెయవద్దని డిఎస్పీ జీవన్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం మండలంలోని రాచాపూర్ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జాడ రాజేశ్వర్ మృతి చెందిన విషయం విథితమే కాగా ఆ ప్రమాదానికి కారకులైనా లక్ష్మణచాందకు చెందిన అరిసెల నరేష్ అనే నిందితుడిని గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించినట్లు డిఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు.

సోన్ సీఐ నవీన్ కుమార్, లక్ష్మణచాంద ఎస్సై రాహుల్ గైక్వాడ్‌ల ఆధ్వర్యంలో సోన్ మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు.ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ నిందితుడు నరేష్ వారి అన్న అయిన అరిసెల రాకేష్ వద్ద టెంట్‌హౌస్‌లో పని చేస్తూ బూలోర వాహన డ్రైవర్‌గా పని చేస్తాడని, ఇదే క్రమంలో నిర్మల్‌లోని శాంతినగర్‌కు డెకొరేషన్ పని మీద ఉదయం దాదాపు 6 గంటల ప్రాంతంలో సమయంలో మద్యం సేవించి వెళ్తుండగా రాచాపూర్ గ్రామ శివారులో ఎదురు వస్తున్నా జాడ రాజేశ్వర్‌ను బలంగా ఢీ కొనడంతో ప్రమాదం జరిగిందని, తాగి వాహనాలు నడుపడం వలన అనేక ప్రమాదాలు జరుగుతాయని, మనం ప్రమాదంలో పడడంతో పాటు ఇతరులు సైతం ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయని, ఎవరైన తాగి వాహనాలు నడిపితే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అలాగే నిందితుడి వద్ద నుండి ఆశోక లీల్యాండ్ వాహనం, తాళంచెవి స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News