Monday, December 23, 2024

విశాఖ ఇండస్ట్రీస్‌కు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ డబ్బులు ఇవ్వొద్దు

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు

మనతెలంగాణ/హైదరాబాద్: విశాఖ ఇండస్ట్రీస్‌కు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఒక్క రూపాయి చెల్లించవద్దంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. వివేక్ వెంకటస్వామి వ్యవహారశైలిపై విహెచ్ ఫైర్ అయ్యారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రిటైర్డ్ జస్టిస్ లావు నాగేశ్వరావు తమను క్రికెట్ సెట్ చేయమని సుప్రీం కోర్టు నియమించిందని, కానీ, ‘విశాఖ’కు డబ్బులు చెల్లించేందుకు కాదన్నారు.

ఇష్టానుసారం కోట్ల రూపాయాలు ఎవరికి పడితే వాళ్లకి ఇస్తే పిల్లల భవిష్యత్ ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. విశాఖ కంపెనీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దని స్పష్టం చేశారు. ఆ డబ్బులతో వరంగల్, నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మంలో స్టేడియాలు నిర్మించవచ్చని వి.హనుమంతరావు పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News