- Advertisement -
హైదరాబాద్: మాస్కుల వినియోగం తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాలు, పని చేసే ప్రదేశాలు, ప్రజా రవాణా వాహనాల్లో ఖచ్చితంగా మాస్కులు ధరించాలని పేర్కొంది. మాస్కులు ధరించని వారిపై విపత్తు నిర్వహణ చట్టం, ఐపిసి కింద చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. మాస్కు నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని, కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్‌పిలకు ఆదేశాలు జారీ చేసింది. షబ్-ఎ-రాత్, హోలీ, ఉగాది, శ్రీరామనవమి, మతపరమైన బహిరంగ ఉత్సవాలు నిర్వహించొద్దని ఆదేశాలు జారీ చేసింది.
- Advertisement -