Monday, January 20, 2025

తహసీల్దార్ల పరిధిలోని పనులు పెండింగ్‌లో ఉండొద్ద్దు

- Advertisement -
- Advertisement -

వరంగల్ : తహసీల్దార్ల పరిధిలోని పనులను నిర్ధేశిత కాలంలో పూర్తి చేయాలని, ఎలాంటి పెండింగ్ లేకుండా చూసుకోవాలని వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. రెవెన్యూకు సంబంధించిన వివిధ అంశాలపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని మండలాల తహసీల్దార్ కలెక్టర్ సమీక్షించి పలు ఆదేశాలను జారీ చేశారు. జీవో 58, 59 క్రింద వచ్చిన దరఖాస్తులను వారం రోజుల్లో వెరిఫికేషన్ చేయాలన్నారు.

సాంఘిక సంక్షేమానికి సంబంధించిన పట్టాల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి లబ్ధ్దిదారులను గుర్తించాలన్నారు. లే అవుట్ మ్యాప్స్ తయారుచేసిన అనంతరం లే అవుట్ కమిటీ అప్రూవల్ తీసుకొని ప్లాటింగ్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. కొత్త వాళ్లు దరఖాస్తు చేసుకునేందుకు నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. పిఓటి కేసులకు సంబంధించి జివో నిబంధనల ప్రకారం దరఖాస్తులను పరిశీలించి ధరణిలో ప్రాసెస్ చేసేందుకు సిద్ధ్దం చేయాలన్నారు.

ధరణి మ్యాడ్యూల్స్ లో ఉన్న పెండింగ్స్‌ను త్వరగా క్లియర్ చేయాలని ఆదేశించారు. తహసీల్దార్ల వద్ద ఉన్న ధరణి దరఖాస్తులను త్వరగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. తహసీల్దార్ల వద్ద అన్ని రకాల సర్టిఫికేట్‌లను నిర్ధేశిత సమయంలో జారీ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్షం చేయోద్దన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీవత్స, వరంగల్ ఆర్‌డిఓ మహేందర్ జి, కలెక్టరేట్ కార్యాలయ పరిపాలనాధికారి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News