Monday, December 23, 2024

ఫ్యాన్సీ నెంబర్ల బిడ్ వివరాలు మాకు తెలియదు

- Advertisement -
- Advertisement -

‘మన తెలంగాణ’ కథనానికి అధికారుల స్పందన
మన తెలంగాణ/హైదరాబాద్: ఫ్యాన్సీ నెంబర్లకు సంబంధించి ఎవరు ఎంత బిడ్ వేశారన్న విషయాలు తమకు తెలియవని రవాణా శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం ‘మనతెలంగాణ’ దినపత్రికలో ‘ఫ్యాన్సీ నెంబర్‌ల దందా’ పేరుతో ప్రచురితమైన కథనానికి సంబంధించి రవాణా శాఖ అధికా రులు వివరణ ఇచ్చారు. రిజర్వేషన్‌లు ఉదయం 8 గంటలకు ఓపెన్ అవు తాయని, ఒంటిగంటకు క్లోజ్ అవుతాయని రవాణా శాఖ అధికారులు తెలి పారు. 2 గంటలకు మేసెజ్ వస్తుందని, ఎంతమంది యాక్షన్‌లో పాల్గొన్నా రు.

అనేది కూడా మేసెజ్ వస్తుందని 5 గంటలకు బిడ్డింగ్ ఫలితాలు వెల్లడి స్తామని వారు పేర్కొన్నారు. ఫ్యాన్సీ నెంబర్ అలాట్ అయిన వారికి కంగ్రాట్స్ అన్న మేసెజ్ వస్తుందని, లేకుంటే ఫ్యాన్సీ నెంబర్ ఎంత వేలంలో పోయిం దన్న వివరాలను ఎస్‌ఎంఎస్ రూపంలో పంపిస్తామని రవాణా శాఖ అధికా రులు తెలిపారు. బిడ్డింగ్‌లో పాల్గొని ఫ్యాన్సీ నెంబర్ రాని వారికి రెండు, మూడు రోజుల్లో డబ్బులు వాపసు ఇస్తామని వారు పేర్కొన్నారు. ఎవరికి ఫ్యాన్సీ నెంబర్ అలాట్ అయ్యిందన్న వివరాలు తమకు తెలియవని రవాణా శాఖ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News