Wednesday, January 22, 2025

ఆరోగ్యశ్రీ తో రేషన్ కార్డులు ముడిపెట్టొద్దు : సిఎం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆరోగ్య సేవలు పొందే పేదల ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులకు రేషన్ కార్డులు ముడిపెట్టొద్దని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రి మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ పౌరుల ఆరోగ్య శ్రీ వివరాలు సేకరించి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని అన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే డాక్టర్ల జీతాలు పెంచుతామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రికి సీరియల్ నంబర్ కేటాయించాలని సూచించారు. సమావేశానికి హాజరైన కలెక్టర్లను ఉద్దేశించి గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలకు ప్రత్యేక విధానం ఏర్పాటు చేయాలన్నారు. అట్టడుగు ప్రజల కష్టాలు తెలుసుకోడానికి వారితో మమైకం కావాలని కలెక్టర్లను రేవంత్ కోరారు. వివిధ రాష్ట్రాలకు చెందిన కలెక్టర్లను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణను తమ రాష్ట్రంగా భావించి ప్రజల సంస్కృతిలో భాగం కావాలన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి కలెక్టర్లు ‘కళ్లు, చెవులు’ అని ఆయన అభివర్ణించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News