Thursday, January 23, 2025

ప్రాజెక్టులపై రాజకీయాలు చేయొద్దు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేశామని మంత్రి కెటిఆర్ తెలిపారు. తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై మంత్రి కెటిఆర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు, 20 రిజర్వాయర్లు, 20 లిఫ్టులు అని తెలియజేశారు. ప్రాజెక్టులపై రాజకీయాలు చేయవద్దని సూచించారు. ప్రాజెక్టులను బద్నాం చేసి అన్యాయం చేయొద్దని, బ్యారేజీల్లో సమస్యలు కామన్‌గా వస్తాయని, సాగర్ కట్టిన తరువాత కూడా లీకేజీకి సమస్యలు వచ్చాయని, రెండేళ్ల క్రితం శ్రీశైలం పంపులు కూడా నీటిలో మునిగాయని కెటిఆర్ పేర్కొన్నారు. హరిత కార్యక్రమంతో తెలంగాణలో గ్రీన్ కవర్ 7.7 శాతం పెరిగిందని ప్రశంసించారు. ఉమ్మడి రాష్ట్రంలో రెండు మెడికల్ కాలేజీలు ఉంటే ఇప్పుడు 34 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని వివరించారు. వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నామని కెటిఆర్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News