Monday, December 23, 2024

ఊరెళ్లితే సోషల్ మీడియాలో పెట్టకండి

- Advertisement -
- Advertisement -

దొంగలకు అవకాశం ఇవ్వకండి.. రాచకొండ సిపి మహేష్ భగవత్

Do not post on social media

మన తెలంగాణ/సిటీబ్యూరో: సంక్రాంతికి గ్రామాలకు వెళ్లే వారు సో షల్ మీడియాలో వాటికి సంబంధించిన పోస్టింగ్‌లు పెట్టవద్దని రా చకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. సంక్రాంతికి వెళ్లే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన పోస్టర్‌ను సోమవారం ఆ యన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతూ పండగకు గ్రామాలకు వెళ్తున్నట్లు సో షల్ మీడియాలో పోస్టింగ్‌లు పెడితే వాటిని చూసిన దొంగలు చోరీలు చేస్తున్నారని తెలిపారు. దీని వల్ల ఇంటి యజమానులు వారికి తెలియకుండానే దొంగలకు సమాచారం ఇస్తున్నారని తెలిపారు. ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టంను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఇంట్లో లైట్లు వెలిగేలా చూడాలని, ఇంటి పక్కన ఉండే వారికి సమాచారం ఇవ్వాలని అన్నారు. గ్రామాలకు వెళ్తున్న వారు స్థానిక పోలీసులకు స మాచారం ఇవ్వాలని అన్నారు. సిసి కెమెరాలు పెట్టుకోవాలని, ఇంట్లో విలువైన వస్తువులు, బంగారం, వెండి వస్తువులు పెట్ట వద్దని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News