Thursday, January 2, 2025

బెట్టింగ్ యాప్‌లను ప్రమోషన్‌లు చేయకండి

- Advertisement -
- Advertisement -

ఈ యాప్‌లతో చాలామంది ప్రాణాలు పోతున్నాయి
ప్రచారం చేయకండి….ఆలోచించండి..
ప్రజలు ఆన్‌లైన్ బెట్టింగ్ మాయలో పడొద్దు
టిజిఎస్‌ఆర్టీసి ఎండి విసి సజ్జనార్

మనతెలంగాణ/హైదరాబాద్: బెట్టింగ్ యాప్‌లను ప్రమోషన్‌లు చేయడానికి కక్కుర్తి పడకండి అని టిజిఎస్‌ఆర్టీసి ఎండి విసి సజ్జనార్ ట్వీట్ చేశారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లపై స్పందించిన ఆయన ట్విట్టర్‌లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ బెట్టింగ్ యాప్‌ల వల్ల ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటున్న యాప్‌ల గురించి ప్రచారం చేయకండని ఆయన సూచించారు. రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావొచ్చని మీరు సోషల్ మీడియాలో వదిలే ఇలాంటి వీడియోల వల్ల అమాయకులు ఆన్‌లైన్ బెట్టింగ్ మహామ్మారికి వ్యసనపరులు అవుతున్నారని, బంగారు జీవితాలను చిద్రం చేసుకుంటున్నారని ఆయన తెలిపారు.

అలాగే మీ స్వలాభంకోసం ప్రజాశ్రేయస్సును విస్మరించడం ఎంత వరకు సమంజసమని, సమాజ క్షేమం పట్టని మీ పెడధోరణులు క్షమించరానివి అని ఆయన మండిపడ్డారు. కష్టపడకుండానే కాసులు పోగేసుకోవాలన్న ఆలోచన అనర్థదాయమయ్యిందని యువత గుర్తించాలని ఆయన హితవు పలికారు. ఇక స్వార్ధ సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్‌లను ప్రమోషన్‌లు చేసే వారి మాటలు నమ్మి చాపకిందనీరులా సామాజిక సంక్షోభాన్ని సృష్టిస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్ మాయలో పడొద్దని, ఇలాంటి సంఘవిద్రోహ శక్తులకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తూ సజ్జనార్ ఈ పోస్ట్‌ను తెలంగాణ డిజిపి, హైదరాబాద్ పోలీసులకు ట్యాగ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News