Saturday, November 2, 2024

బూస్టర్ డోసు కోసం హడావుడి వద్దు

- Advertisement -
- Advertisement -
Do not rush for booster dose Says Gagandeep Kang
డెల్టాపై టీకాలు భేషుగ్గా పనిచేస్తున్నాయంటోన్న నిపుణులు

న్యూఢిల్లీ : డెల్టా వేరియంట్‌పై కొవిడ్ టీకాలు భేషుగ్గా పనిచేస్తున్నాయని బూస్టర్ డోసుల కోసం అనవసరమైన హడావుడి వద్దని ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ గగన్‌దీప్ కాంగ్ సూచించారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. బూస్టర్ డోసుతో కరోనా నుంచి పూర్తి స్థాయి రక్షణ వస్తుందన్న హామీ లేదని , అయితే వ్యాధి తీవ్రతను తగ్గించడంలో మాత్రం సహకరిస్తుందని ఆమె సూచించారు.

ఇప్పటికే కొన్ని దేశాలు బూస్టర్ డోసుకు ఆమోదం తెలిపాయి. కరోనా మూడో దశ వ్యాప్తి సహా బలహీన రోగనిరోధక శక్తిని దృష్టిలో ఉంచుకుని అగ్రరాజ్యం అమెరికా మూడో డోసు టీకాకు ఆమోదం తెలిపింది. అమెరికన్లు రెండు డోసుల తరువాత మరో టీకా తీసుకునేందుకు అనుమతిస్తూ ఆ దేశ వ్యాధి నియంత్రణ నిర్మూలన కేంద్రం (సిడిసి ) ఆదేశాలు జారీ చేసింది. బ్రిటన్ కూడా అదే బాటలో నడుస్తోంది. డెల్టా వేరియంట్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఇజ్రాయెల్ ఇప్పటికే 10 లక్షల మందికి బూస్టర్ డోసు ఇచ్చినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. టీకా పంపిణీ విషయంలో పేద, దనిక దేశాల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు బూస్టర్ డోసుపై తాత్కాలిక నిషేధం విధించాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ విఞ్జప్తిని ఈ దేశాలు పట్టించుకోలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News