Thursday, January 9, 2025

ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాలు, దుస్తులు అమ్మొద్దు

- Advertisement -
- Advertisement -
  • మండల విద్యాధికారి హారిశ్చందర్

పరిగి: పట్టణంలోని ఆయా ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాలు, దుస్తులు, ఇతర వస్తువులు అమ్మవద్దని అండర్ టేకింగ్ సర్టీఫీకేట్ యాజమానులు ఇవ్వాలని మండల విద్యాధికారి తెలిపారు. పరిగి పట్టణంలోని పలు పాఠశాలలను ఎంఈఓ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంత రాతపూర్వకంగా రెండు రోజులలో అండర్ టేకి ంగ్ సర్టిఫికేట్స్ ఇవ్వాలని సూచించారు. న్యూ బ్రిలియ ంట్ టెక్నో స్కూల్‌లో డ్రెస్స్‌లు, బుక్స్ ఉండటంతో గదికి తాళం వేశారు.

అనంతరం కృష్ణవేణీ టాలెంట్ స్కూల్, బృంగీస్కూల్, ప్రగతి స్కూల్, జేడిహెచ్ స్కూల్, ఇండస్ వ్యాలీ పాఠశాలలో, సెయింట్ మేరీ పాఠశాల, లిటీల్ బడి తనిఖీ చేశారు. లిటీల్ బడ్డీ పాఠశాలలో ఏలాంటి ప్రొజిడింగ్స్ లేనందుకు పాఠశాలను వెంటనే మూసి వే యాలని హెచ్చరించారు. పట్టణంలోని ఆయా ప్రైవేట్ పాఠశాలలో ఇతర వ్యాణిజ్యపరమైనా పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, స్కూల్ బ్యాగ్స్, వంటి వాటిని అమ్మితే కఠిన చర్యలు తస్సవని హెచ్చరించారు.

అధిక ఫీజ్‌లు వసూళ్లు చేస్తున్న పాఠశాలలపై చర్యలు ఉంటాయని చెప్పారు. తల్లిదండ్రులు గత ఏడాధి ఉన్న ఫీజులు మా త్రమే చెట్టించాలని ఎక్కువ ఇవ్వవద్దని సూచించారు. ఏ స్కూల్ ఎక్కువ ఫీజులు తీసుకున్న ఎంఈఓ కార్యా లయంలో ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్ర మంలో ఎమ్మార్పీలు చంద్రశేఖర్, అనంతసాగర్, శ్రీశైలం, మోహన్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News