Thursday, January 23, 2025

నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు ప్రజలకు అమ్మొద్దు

- Advertisement -
- Advertisement -
  • మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్

సిద్దిపేట: నిల్వ ఉంచిన ఆహార పదార్ధాలు ప్రజలకు అమ్మొద్దని మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ అన్నారు. సోమవారం మంత్రి హరీశ్‌రావు అదేశాల మేరకు నాస్వి సంస్ధ, నేస్టే సంస్థ్ధ, ఫసాయి సంస్థ ఆధ్వర్యంలో పురపాలక సంఘం సహకారంతో పట్టణంలోని పుడ్ స్ట్రీట్ వెండర్‌లకు ఎన్‌జీఓ భవన్‌లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని 500 మందికి పుడ్ స్ట్రీట్ వెండర్‌లకు వారు అమ్మే ఆహార పదార్థ్ధాలు పరిశుభ్రత గురించి శిక్షణ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఆహార పదార్థాలు ప్లాస్టిక్ ప్లేట్స్‌లో కాకుండా స్టీల్ ప్లేట్స్ నీ వాడాలన్నారు.

నూనె పదార్థాలు చేసి తప్పుడు పరిశుభ్రమైన నాణ్యత సర్టిఫికేట్ గల నూనెలను వాడాలని పుడ్ సేప్టి ఆఫీసర్ వినయ్‌కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మెప్మా డిఎంసి హనుమంతరెడ్డి, టిఎంసి సాయికృష్ణ, ఎడిఎంసి సంతోషిమాతా, సిఓలు రమ్య, జ్యోతి, నెస్ట్ వసీం, కడంబిని, పుడ్ సేప్టి అధికారి ఖలీల్, నాస్వీ సంస్థ్ధ రాష్ట్ర అధ్యక్షుడు శలేవన్, ఫాస్తాక్ ట్రైనీ స్నేహం, స్ట్రీట్ పుడ్ వెండర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News