Wednesday, January 22, 2025

అపరిచితులకు ఆశ్రయం కల్పించవద్దు

- Advertisement -
- Advertisement -

మహాదేవపూర్: ప్రజలు అపరిచితులకు ఆశ్రయం కల్పించవద్దని మహాదేవపూర్ రెండవ ఎస్‌ఐ భవాని సేన అన్నారు. గురువారం మండలంలోని పెద్దంపేట గ్రామంలో సర్పంచ్ కుర్సం సత్యసాగర్, గ్రామ ప్రజల సమక్షంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్‌ఐ మాట్లాడుతూ ప్రజలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా వారికి ఆశ్రయం కల్పించవద్దన్నారు. ఎవరైన అపరిచితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.

ఒక వేళ అపరిచితులకు ఆశ్రయం కల్పించినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత మద్యం, దురాలవాట్లకు దూరంగా ఉండి చదువుపై శ్రద్ధ పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పోలీస్ సిబ్బంది, సిఆర్‌పిఎఫ్, సివిల్ పోలీసులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News