Wednesday, January 29, 2025

ఏ ఇంట్లోను నీరు నిల్వ ఉండొద్దు

- Advertisement -
- Advertisement -

సిరిసిల్ల : ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం పట్టణంలోని ప్రతి ఇంట్లో ఉన్న నీటి నిల్వలు లేకుండా ఫ్రైడే, డ్రై డే పాటించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రజలకు సూచించారు. మంగళవారం డ్రై డేను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ సిరిసిల్ల పట్టణంలో 17,18,19 వార్డులలో పర్యటించి పారిశుధ్య తనిఖీలు చేశారు. కలెక్టర్ సైడ్ డ్రైనేజిలు, ఇండ్లలో పరిశీలించి, నిల్వ నీటిలో లార్వా ఉన్నది లేనిది పరిశీలించారు.

ఇంటింటికి తిరిగి ఇంట్లో పరిసరాలను పరిశీలిస్తు నీటి నిల్వలను తొలగిస్తు జాగ్రత్తల విషయమై జాగ్రత్తల విషయమై ప్రజలకు కలెక్టర్ అవగాహన కల్పించారు. మిషన్ భగీరథ నీరు వస్తుందా..? చెత్త సేకరణ వాహనం రోజు మీ ఇంటికి వస్తుందా..? మీ ఇంట్లో ఎవరికైనా జ్వరాలు ఉన్నాయా…? అంటూ ప్రజలను ప్రశ్నించారు. భగీరథ నీరు క్రమం తప్పకుండా వస్తుందని, చెత్త సేకరణ వాహనం రోజు ఇంటికి వస్తుందని ప్రజలు తెలిపారు. జ్వరాలు ఎవ్వరికి లేవని సమాధానం ఇచ్చారు.

ఇండ్లలో మంచి నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. మంచి నీటిలోనే డెంగ్యూ దోమలు వృద్ది చెందుతాయని అన్నారు. వారానికి 3 సార్లు డ్రై డే చేపడితే దోమలు వృద్ది చెందకుండా, దోమ కాటు రాకుండా నియంత్రించవచ్చని అన్నారు. పరిశుభ్రమైన ఆహారం తాగు నీటిని మాత్రమే ఈ వర్షాకాలం తీసుకోవాలని సూచించారు. నిర్లక్షం చేస్తే దోమలు కుట్టి డెంగ్యూ వస్తే చాలా కష్టమని ఆర్థికంగా నష్టపోవడంతో పాటు ప్రాణహాని ఉంటుందని ఆయన తెలిపారు.

డ్రై డేలో భాగంగా ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం మెప్మా రిసోర్స్ పర్సన్, ఏఎన్‌ఎంలు, ఆశాలు ఇంటింటికి తిరుగుతూ పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యం, కీటక జనిత వ్యాధుల వల్ల కలిగే నష్టాలను వివరించి చైతన్యం చేయాలన్నారు. ఇండ్లలో మంచి నీరు నిల్వ ఉంటే వాటిని పారబోయాలన్నారు. రోడ్లకు ఇరు వైపులా డ్రైన్‌లలో నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ది చెందకుండా ద్రావణం పిచికారీ చేయాలన్నారు. ఉపయోగంలో లేని బావుల్లో నీరు ఉంటే ఆయిల్ బాల్‌లు వేయాలని అన్నారు.

గర్భీణీల పట్ల స్నేహపూర్వకంగా ఉంటూ సేవలు అందించాలి

మంగళవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వేములవాడ ఏరియా ఆసుపత్రి జిల్లా ఆసుపత్రిలో ప్రసూతి సేవల కోసం వచ్చే గర్భీణీలకు వైద్య సేవలు వేగంగా అందించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పిఆర్ వ్యవస్థ( మెటర్నీటి సర్వీస్ ఎగ్జిక్యూటివ్) పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రికి పరీక్షలు, చికిత్స, డెలివరీ కోసం వచ్చే గర్భీణీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వేగంగా సేవలు అందేలా చూడాలని వైద్యాధికారులు మెటర్నీటి సర్వీస్ ఎగ్జిక్యూటివ్‌లకు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.

ఆసుపత్రికి వచ్చిన గర్భీణీల వివరాలు నమోదు నుండి, పరీక్షలు స్కానింగ్, లేబర్ రూం తదితర సేవలను పరిశీలించారు. గర్భీణీలలో జిల్లా కలెక్టర్ స్వయంగా మాట్లాడారు. కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామానికి గర్భీణీ మిరియాల శైలజతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. హైరిస్క్ రక్తహీనత సమస్యలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. ఆమె రిపోర్ట్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కొంచెం ఐరన్ తక్కువగా ఉందని పోషకాహారం తో కూడిన ఆహారం గట్టిగా తినాలని చెప్పారు. క్షేత్రపర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, జిల్లా వైద్యాధికారి డా. సుమన్ మోహన్ రావు, పంచాయతీ రాజ్ కార్యనిర్వాహక ఇంజనీర్ సూర్యప్రకాష్, టౌన్ ప్లానింగ్ అధికారి అన్సారీ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News