- Advertisement -
హైదరాబాద్: టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున పార్టీ నాయకులు మీడియా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని మంత్రి కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్టు మొరుగుతూనే ఉంటారని మండిపడ్డారు. దొంగల మాటలను టిఆర్‌ఎస్ శ్రేణులు పట్టించుకోవద్దని సూచించారు.
నలుగురు టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల కొనుగోలు చేసేందుకు బిజెపి కుట్రకు తెరలేపింది. ఎంఎల్‌ఎ రోహిత్‌రెడ్డి ఫౌంహౌస్ కేంద్రంగా మంతనాలు జరిపారు. నలుగురు ఎంఎల్‌ఎలు సమాచారం ఇవ్వడంతో ముగ్గురు నిందితులను పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.15కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. దాదాపుగా ఒక్కో ఎంఎల్‌ఎకి దాదాపుగా రూ.100 కోట్లు ఆఫర్ పెట్టినట్టు సమాచారం.
- Advertisement -