Wednesday, January 22, 2025

గణనాథుడికి తొలి పూజ చేయండి

- Advertisement -
- Advertisement -

గవర్నర్‌కు విజ్ఞప్తి చేసిన ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ

మనతెలంగాణ/హైదరాబాద్:  తొమ్మిది రోజుల పాటు ఖైరతాబాద్ గణేశ్ పూజలు అందుకోనున్నారు. ఇందుకోసం గణేశ్ ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలోనే వినాయకుడికి సోమవారం తొలి పూజ గవర్నర్ తమిళి సైతో చేయించాలని కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో ఆమెను కలిశారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఖైరతాబాద్ గణేశుడికి తొలి పూజ చేయాలని గవర్నర్‌ను వారు కోరారు. దీనికి ఆమె సానుకూలంగా స్పందించారు.

ఖైరతాబాద్ గణేశ్‌కు తొలి పూజ చేయడం తన పూర్వ జన్మ సుకృతమని గవర్నర్ వారితో పేర్కొన్నారు. ఈ ఏడాది 63 అడుగుల గణేశుడు పూజలందుకునేందుకు సిద్ధమయ్యారు. 9 రోజుల పాటు భక్తుల దర్శనాలకు ఉత్సవ కమిటీ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం గవర్నర్ చేతుల మీదుగా గణనాథుడికి తొలి పూజ జరగనుంది. 9 రోజలు పాటు గణనాథుడు పూజలందుకున్న అనంతరం నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఖైరతాబాద్ పరిసరాల్లో శోభాయాత్ర నిర్వహించి హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేస్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News