Monday, December 23, 2024

మాకూ న్యాయం చేయండి!

- Advertisement -
- Advertisement -
ప్రభుత్వానికి ఉర్దూ కంప్యూటర్స్ కాంట్రాక్ ఉద్యోగుల వినతి

మన తెలంగాణ / హైదరాబాద్ : చాలీచాలని వేతనాలతో బతికీడుతున్న తమకు కనీస వేతనాలు అమలుచేసి న్యాయం చేయాలని ఉర్దూ కంప్యూటర్స్ కాంట్రాక్ట్ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 15 నుండి 20 ఏళ్ళ సర్వీసు కలిగి ఉన్నా తమకు కనీస వేతనాలు చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉర్దూ అకాడమి ఆధ్వర్యంలో నియమితులైన ఈ కంప్యూటర్ కం లైబ్రరీస్ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో 144 మంది పనిచేస్తున్నారు. ఆఫీస్ సబార్డినేట్‌కు రూ. 5,500, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగులకు రూ.8,500 చెల్లిస్తున్నారు.

ప్రస్తుతం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయాల్లో , వివిధ మైనారిటీ కార్యాలయాల్లో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న తమకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కనీస వేతనాలు అమలు చేస్తోందని, తమకు కూడా 2015, 2020 పిఆర్‌సిలను అమలు చేయాలని దీని ద్వారా కనీస వేతనాలు అమలు జరుగుతుందని అభ్యర్థిస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆర్థిక శాఖ క్లియరెన్స్ లభించిన వెంటనే కనీస వేతనాలు అమలు జరుగతాయని దీనిని త్వరిత గతిన పూర్తి చేసి న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News