Friday, January 24, 2025

కొవిడ్ బాధితులైన మహిళలకు మెనోపాజ్ వేగంగా వస్తుందా?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మహిళలు ఎవరైతే తమను సుదీర్ఘకాలంగా కొవిడ్ వెంటాడుతోందని అనుకొంటుంటారో వారికి వేగంగా రుతుచక్రం ఆగిపోతుందని వైద్యులు చెబుతున్నారు. కొవిడ్ , మెనోపాజ్ (బహిష్టు ఆగిపోవడం) ఈ రెండిటికీ అలసట, కండరాల నొప్పులు, మెదడు పొగమంచు ( బ్రెయిన్ ఫాగ్) తదితర ఒకే విధమైన లక్షణాలు ఉంటాయని వైద్యులు భావిస్తున్నారు. సొలిహల్‌కు చెందిన మెనోపాజ్ వైద్య నిపుణులు డాక్టర్ లూయిస్ న్యూసన్ మహిళలు ఇలాంటి అస్పష్ట లక్షణాలతో సతమతమవుతుంటే మెనోపాజ్‌ను నివారించే ఔషధాలను తీసుకోవలసి ఉంటుందని సూచించారు.

సుదీర్ఘకొవిడ్‌ను గుర్తించడానికి ప్రత్యేకించి నిర్దిష్టమైన పరీక్ష అంటూ ఏదీ లేదని, కొవిడ్‌కు, మెనోపాజ్‌కు ఇంచుమించు ఒకే లక్షణాలు కనిపిస్తుంటాయని చెప్పారు. సుదీర్ఘకొవిడ్ ఉన్నట్టు చాలామంది నడివయసు మహిళలు ఫిర్యాదు చేశారని, అయితే అలాంటి వారు వాస్తవంగా మెనోపాజ్‌తో బాధపడుతున్నారా లేదా అని పరీక్షించుకోవాలని ఆమె చెప్పారు. మహిళలకు స్క్రీనింగ్ చేయించుకుని హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (హెచ్‌ఆర్‌టి) వైద్యచికిత్స చేయించుకోవడం మేలని సూచించారు.

బ్రిటన్‌లో రెండు మిలియన్‌కన్నా ఎక్కువ మంది తమకు సుదీర్ఘకొవిడ్ లక్షణాలు ఉన్నాయని నేషనల్ స్టేటస్టిక్స్ సర్వే వెల్లడించింది. సుదీర్ఘ కాల కొవిడ్ లక్షణాలు ఉన్నట్టు చెప్పే మహిళల వయసు సరాసరిన 46.5 ఏళ్లు ఉంటున్నాయి. ఇలాంటి మహిళలు 82. 5 శాతం వరకు ఉన్నారని సౌథాంప్టన్ యూనివర్శిటీ సర్వే వెల్లడించింది. సాధారణంగా 45 నుంచి 55 ఏళ్ల మధ్య వయసు మహిళల్లో బహిష్టు ఆగిపోతుంటుంది. ఆస్ట్రోజెన్ వంటి హార్మోన్ స్థాయిలు తగ్గిపోవడం వల్లనే ఇలా జరుగుతుంది. దాదాపు ప్రతి పదిమంది మహిళల్లో ఏడుగురికి ఈ అనుభవం ఎదురౌతుంది.

కొవిడ్ వచ్చిన తరువాత వ్యాక్సిన్ వాడితే రుతుక్రమంలో మార్పు వచ్చిందని వేలాది మంది మహిళలు చెప్పారు. రెండు డోసులు తీసుకున్న తరువాత రుతుచక్రం పెరిగిందని మహిళలు అనుకున్నా అది తాత్కాలికమే అని అధ్యయనాలు చెబుతున్నాయి. కొవిడ్ లేదా గవదబిళ్లలు, టీబీ, మలేరియా వంటివి వచ్చినా మెనోపాజ్ వేగంగా వస్తుందని తెలుస్తోంది. అయితే ఆయా ఇన్‌ఫెక్షన్ వల్ల తాము గర్భిణి కాలేకపోతున్నామని మహిళలు పేర్కొంటున్నారు. ఏదేమైనా మెనోపాజ్ లక్షణాలు కనిపించగానే హార్మోన్ రీప్లేసింగ్ థెరపీ చికిత్స చేయించుకోవడం మంచిదని డాక్టర్ న్యూసన్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News