Saturday, April 5, 2025

ఖ‌ర్జూర పండ్లు తింటున్నారా..?

- Advertisement -
- Advertisement -

ఖర్జూరం తినడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. ఈ డ్రై ఫ్రూట్ ను సరైన పరిమాణంలో, సరైన పద్ధతిలో, డైట్ ప్లాన్‌లో చేర్చుకుంటే, అది మొత్తం ఆరోగ్యాన్ని చాలా వరకు మెరుగుపరుస్తుంది. అయితే, ఖర్జూరం తినడం వల్ల కొంతమందికి ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం చూపుతుందని మీకు తెలుసా? ఈ డ్రై ఫ్రూట్ వల్ల కలిగే కొన్ని దుష్ప్రభావాల గురించి ఇక్కడ చూద్దాం.

ఆరోగ్య నిపుణుల సలహా లేకుండా మూత్రపిండాల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు ఖర్జూరాన్ని తీసుకోకూడదు. అధిక పరిమాణంలో ఖర్జూరం తీసుకోవడం వల్ల బరువు కూడా పెరుగుతుంది. అందువల్ల ఊబకాయం నుండి విముక్తి పొందాలనుకుంటే ఖర్జూరాలు తినడం మానుకోవాలి.

విరేచనాలతో బాధపడుతుంటే ఈ ఎండిన పండ్లను తినకుండా ఉండటం మంచిది. ఖర్జూరం విరేచనాల సమస్యను పెంచే అవకాశం ఉంటుంది. ఖర్జూరాలు అధికంగా తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య కూడా పెరగవచ్చు.

గర్భిణీ స్త్రీలు కూడా ఖర్జూరాలను ఎక్కువగా తినకూడదు. వైద్యుడిని సంప్రదించకుండా ఈ డ్రై ఫ్రూట్ ను ఆహారంలో చేర్చుకోకూడదు. అంతేకాకుండా ఖర్జూరం తినడం వల్ల అలెర్జీ ఉంటె ఆహారంలో భాగం చేసుకోకూడదు.

షుగర్ ఉన్నవారు ఖర్జూరం తినకపోవడం చాలా మంచిది. ఎందుకంటే ఖర్జూరాలలో సహజ చక్కెరలు సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్ ఉంటాయి. అంతేకాకుండా చర్మంపై దద్దుర్లు లేదా ఉబ్బసం వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కూడా ఈ డ్రై ఫ్రూట్ కు ఎంత దూరం ఉంటె అంత మంచిది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News