Thursday, January 23, 2025

అలెక్సా అంటే ఏమిటో తెలుసా?

- Advertisement -
- Advertisement -

ఇప్పటి డిజిటల్ యుగంలో డిజిటల్ వాయిస్ అసిస్టెంట్ డివైజ్‌లపై ప్రజలు ఎక్కువగా ఆధారపడుతున్నారు. అలెక్సా, అమెజాన్ ఏకో, గూగుల్ హోమ్ వంటివి ఇప్పటికే చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ వాయిస్ అసిస్టెంట్ టెక్నాలజీ రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. ఇప్పుడు వాడుకలో ఉన్న డివైజ్‌లు రోబోలా కాకుండా అచ్చం నిజమైన వ్యక్తిలా మాట్లాడుతున్నాయి. ప్రస్తుతం అమెజాన్ అలెక్సా అమితాబ్ బచ్చన్ వంటి అనేక మంది సెలబ్రిటీల వాయిస్‌ను మిమిక్రీ చేస్తూ యూజర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. తాజాగా అలెక్సా సాధారణ వ్యక్తులను కూడా అనుకరించే ఫీచర్‌ను అప్‌డేట్ చేసేందుకు అమెజాన్ సిద్ధమైంది. చనిపోయిన వారి గొంతును కూడా అలెక్సా అనుకరించేలా అమెజాన్ కొత్త టెక్నాలజీని ప్రవేశ పెడుతోంది.

లాస్‌వెగాస్‌లో 2022జూన్ 21 నుంచి 24 వరకు జరిగిన అమెజాన్ గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్( ai) , మెషిన్ లెర్నింగ్ (ml) సదస్సులో అమెజాన్ అలెక్సా ఏఐ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ , ప్రధాన శాస్త్రవేత్త రోహిత్ ప్రసాద్ డెమో ప్రదర్శించారు. ఈ డెమోలో అలెక్సా డివైజ్ చనిపోయిన వ్యక్తి వాయిస్‌ను అద్భుతంగా మిమిక్రీ చేసింది. ఈ డెమో ప్రదర్శించడానికి ఒక చిన్న పిల్లాడు, చనిపోయిన అతని అమ్మమ్మ వాయిస్ శాంపిల్‌ను అమెజాన్ ఉపయోగించింది.

ఈ డెమోలో ఆ పిల్లవాడు అమ్మమ్మ గొంతులో ది విజార్డ్ oz వినిపించాలని అలెక్సాని కోరాడు. అప్పుడు అలెక్సా సరే అని అమ్మమ్మ గొంతులో ఆ నవల చదివి వినిపించింది. చనిపోయిన వారి వాయిస్ మళ్లీ వింటుంటే ఒక మధురాతి మధురమైన అనుభూతి కలిగించిందని , ఇది అద్భుతమైన ఫీచర్లు అని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అమెజాన్ అలెక్సా ఒక స్మార్ట్ డివైజ్. వర్చువల్ వాయిస్ అసిస్టెన్స్ డివైజ్‌గా దీన్ని ఉపయోగిస్తున్నారు. యూజర్ల ప్రశ్నలకు ఈ డివైజ్ చక్కగా సమాధానం చెబుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News