Wednesday, January 22, 2025

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తామంటూ మోసగించిన ముఠా అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తామంటూ కోట్లు కొల్లగొట్టిన ముఠాను రాచకొండ కమిషనరేట్ మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు.

కుషాయిగూడకు చెందిన ఏనుగు సురేందర్ రెడ్డి, మరి ఆరుగురు ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లు చెప్పి డబుల్ బెడ్ రూమ్ లు ఇపిస్తామని, ప్రభుత్వ స్థలాలు ఇప్పిస్తామని, నచ్చిన చోటికి ప్రభుత్వ ఉద్యోగులను బదిలీ చేయిస్తామంటూ దండీగా డబ్బులు వసూలు చేశారు. దాదాపు 107 మందిని మోసగించి రూ. 1.29 కోట్లు వసూలు చేసినట్లు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. నిందితులైన సురేందర్ రెడ్డి, మెరీనా రోస్, అంజయ్య, వెంకటేశ్, గోపాల్ నాయక్, హర్షిణీ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News