Thursday, January 23, 2025

మొక్కలు నాటిన డాక్టర్ బాబు

- Advertisement -
- Advertisement -

Doctor babu planted tree in green india challenge

హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జిహెచ్ఎంసి పార్కులో కార్తీకదీపం సీరియల్ ఫేం నటుడు నిరుపమ్(డాక్టర్ బాబు) మొక్కలు నాటాడు.

ఈ సందర్భంగా నిరుపమ్ మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు ఎంపి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టడం ఆనందంగా ఉందని అన్నారు. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఈ కార్యక్రమం ఏంతో అవసరమని ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. కాలుష్యాన్ని అరికట్టేందుకు పర్యావరణానికి మొక్కలు ఎంతో మేలు చేస్తాయన్నారు. తన వంతుగా ఈ రోజు గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటానని తెలిపారు. ఈ సందర్భంగా తన సహా నటులు ప్రీతం,అమర్ దీప్ చౌదరి,మానస ముగ్గురికి గ్రీన్ఇండియా చాలెంజ్ విసిరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News