Monday, December 23, 2024

వైద్యురాలు కావ్యాచంద్‌కు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఖమ్మం: ఖమ్మం నగరంలోని ప్రముఖ ఆసుపత్రి అయిన కావ్యా హాస్పిటల్ సి.ఇ.ఓ. డాక్టర్ కావ్యాచంద్ యాలమూడికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌లో స్తానం లభించిందని హాస్పిటల్ మేనేజ్‌మెంట్ రవీందర్ యాలమూడి తెలిపారు. డాక్టర్ కావ్యాచంద్ డయాబెటీస్, లివర్ సమస్యలపై చేసిన పరిశోధనలకు గాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌లో స్తానం లభించినట్లు ఆయన చెప్పారు.

ఖమ్మం నుండి ప్రప్రధమంగా ఈ అరుదైన అవకాశం డాక్టర్ కావ్యాచంద్‌కు లభించటం విశేషమని ఆయన పేర్కోన్నారు. ఈ సందర్బంగా ఖమ్మం కావ్యా హాస్పిటల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమెను ఆసుపత్రి మేనేజ్‌మెంటు, వైద్యులు, సిబ్బంది అభినందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మేనేజ్‌మెంట్ రవీందర్ యాలమూడితో పాటు ప్రసూన పారుపల్లి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News