Monday, January 20, 2025

రోగితో అసభ్యంగా ప్రవర్తించిన వైద్యుడు

- Advertisement -
- Advertisement -

ముంబయి: తల నొప్పి వస్తుందని వైద్యుడి వద్దకు వెళ్తే ఆమెను న్యూరాలజీ డాక్టర్ లైంగికంగా వేధించిన సంఘటన మహారాష్ట్రలోని పునేలోని ముకుంద్‌నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓ మహిళకు మైగ్రేన్ రావడంతో న్యూరాలజిస్ట్ క్లీనిక్‌కు వెళ్లింది. వైద్యుడు మహిళను రూమ్‌లోకి తీసుకెళ్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ 354ఎ సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైద్యుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నామని ఎస్‌ఐ కీర్తి చాటే తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News