- Advertisement -
బెంగళూరు: వైద్యురాలు తుంగభద్ర నదిలో గల్లంతైన సంఘటన కర్నాటక రాష్ట్రం బళ్లారి జిల్లాలోని సణాపురం వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మైనంపల్లి అనన్య రావ్(28) అనే యువ వైద్యురాలు తన స్నేహితులతో కలిసి హంపి పర్యటనకు వెళ్లారు. పలు ప్రాంతాలను సందర్శించిన అనంతరం మంగళవారం రాత్రి సణాపురం గ్రామంలోని ఓ అతిథి గృహంలో బస చేశారు. బుధవారం ఉదయం ఈతకు వెళ్లారు. నీళ్ల ప్రవాహంలో అనన్య కొట్టుకొనిపోవడంతో ఇద్దరు స్నేహితులు స్థానికులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. వైద్యురాలి జాడ కనిపించకపోవడంతో ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బందికి పోలీసులు సమాచారం ఇచ్చారు.
- Advertisement -