Sunday, December 22, 2024

ప్రీతిది ఆత్మహత్య కాదు హత్యే: తండ్రి నరేందర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వైద్య విద్యార్థి ప్రీతిది ఆత్మహత్య కాదని హత్యేనని ప్రీతి తండ్రి నరేంద్రర్ తెలిపారు. ప్రీతి మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. ప్రీతి మృతి కారకులైన అందరి పేర్లు బయటకు రావాలని పిలుపునిచ్చారు. బాధ్యులందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సైఫ్‌ను అరెస్టుతోనే సరిపెట్టాలని చూస్తున్నారని ప్రీతి తండ్రి మండిపడ్డారు. సైఫ్‌ను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు. అమ్మాయిలను వేధించేవారికి గట్టి హెచ్చరిక పంపాలన్నారు. ప్రీతి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని తండ్రి పేర్కొన్నారు.

తన చెల్లి ధైర్యవంతురాలని, ప్రతిభావంతురాలని, డిసెంబర్ నుంచే సైఫ్ వేధిస్తున్నాడని ప్రీతి చెప్పిందని సోదరి పూజ తెలిపారు. ఇటీవల సైఫ్ వేధింపులు తీవ్రమయ్యాయని వివరించారు. తన చెల్లి మృతిపై అనుమానాలు నివృత్తి చేయాలన్నారు. వైద్య విద్యార్థిని ప్రీతి స్వస్థలం గిర్ని తండా శోకసంద్రంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News