Sunday, December 22, 2024

నర్సింగ్‌హోంలో డాక్టరు దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో తెల్లవారుజామున ఓ డాక్టరును నర్సింగ్‌హోంలోనే ఓ వ్యక్తి తుపాకీతో కాల్చిచంపాడు. ఈ ఘటన స్థానిక కాళింది కుంజ్ ప్రాంతంలో జరిగింది. నిందితుడు బాలుడు అని తరువాతి దర్యాప్తులో వెల్లడైంది. చికిత్స కోసం వచ్చిన వ్యక్తి యునానీ డాక్టరు అయిన జావెద్ అక్తర్‌పై దగ్గరి నుంచే కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. తలకు గాయం కావడంతో కుర్చీలోనే డాక్టరు అచేతనంగా పడి ఉండగా గుర్తించారు. ఈ ఘటనలో ఇద్దరు బాలుల పాత్ర ఉందని ప్రాధమిక దర్యాప్తులో తెలిసింది. ఆసుపత్రిలో కాల్పుల చప్పుళ్లతో కలవరం చెలరేగింది. జరిగిన ఘటన గురించి అక్కడి సిసిటీవీ ఫుటేజ్‌లోని దృశ్యాల ద్వారా ఆరా తీసేందుకు యత్నిస్తున్నట్లు పోలీసు అధికారి ఒకరు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News