Monday, January 20, 2025

పుల్లూరి ప్రకాష్‌కు డాక్టరేట్

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి టౌన్: ప్రపంచ హెల్త్ యూనివర్సీటీ చికాగో అంతరాతీయ మెడికల్ న్యూట్రిషన్ అండ్ ఇరిడాలజీ సదస్సులో సంగారెడ్డికి చెందిన సామాజిక కార్యకర్త పుల్లూరి ప్రకాష్‌కు గౌరవ డాక్టరేట్‌ను అందజేశారు. గురువారం హైదరాబాద్‌లోని బిఎం మ్యూజియంలో జరిగిన కార్యక్రమంలో గుడ్ సమారిటన్ థియోలజికల్ అంతర్జాతీయ యూనివర్సిటీ మనం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో డాక్టరేట్ అవార్డుల ప్రదానోత్సవంలో సంగారెడ్డి వాసి పుల్లూరి ప్రకాష్‌కు అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ అమెరికా అధ్యక్షుడు రామకృష్ణషా, బ్రహ్మశ్రీ దైవజ్ఞశర్మ డాక్టరేట్‌ను అందించారు. ఈ అవార్డుతో మరింద భాధ్యత పెరిగిందని సేవా కార్యక్రమాలతో ముందుకెళతానన్నారు. ఈ అవార్డు రావడానికి సేవ కార్యక్రమాల్లో సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యావాదాలు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News