Monday, December 23, 2024

తెగిపడ్డ బాలుడి తలను అతికించారు

- Advertisement -
- Advertisement -

జెరూసలేం : ఇజ్రాయెల్‌లో వైద్య చరిత్రలో అత్యద్భుతం చోటుచేసుకుంది. ఓ ప్రమాదంలో తెగిన బాలుడు సులేమాన్‌హస్సన్ తలను వైద్యులు తిరిగి అతికించారు. ప్రాణాలు నిలబెట్టారు. 12 ఏండ్ల బాలుడు సైకిల్‌పై వెళ్లుతూ ఉండగా ఓ కారు డోర్ తెరుచుకుని తల దాదాపుగా తెగింది. దీనితో ఇక ఈ బాబు జీవించడం కష్టమే అని ఆందోళన వ్యక్తం అయింది. పరిస్థితిని గమనించి చికిత్స జరిపారు. సర్జరీ ద్వారా తిరిగి తలను అతికించారు. తల దాదాపుగా మెడ నుంచి వేరయి ఉండగా బాలుడిని వెంటనే విమానం ద్వారా హదాసా వైద్య కేంద్రానికి తరలించారు.

ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఒహాద్ ఇనావ్ ఆధ్వర్యంలో ఆపరేషన్ జరిగింది. తల మెడతో అనుసంధానం అయ్యే కణాలు పూర్తిగా దెబ్బతిని ఉండటంతో పలు గంటల పాటు శ్రమించి వైద్యుల బృందం కొత్త అమరికతో తిరిగి తలను అతికించారు, ఇప్పుడు ఈ బాబు సంపూర్ణ ఆరోగ్యంతో మునుపటిలాగానే తలెత్తుకుని ఉన్నాడు. ఈ కీలక ఆపరేషన్ ప్రక్రియ గత నెలలోనే జరిగింది. అయితే పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకుని, పూర్తిస్థాయిలో ఇది విజయవంతం అయిందని నిర్థారించుకున్న తరువాత ఈ నెలలో దీని గురించి ఈ మెడికల్ సెంటర్ నుంచి ప్రకటన వెలువడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News