Sunday, November 24, 2024

నిందితుడి బ్లడ్ టెస్ట్ రిపోర్ట్‌నే మార్చేసిన ఫోరెన్సిక్ వైద్యులు

- Advertisement -
- Advertisement -

పుణెలో టీనేజర్ పోర్ష్‌కారు ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఇద్దరు టెకీలు మృతి చెందిన కేసులో అనుకోని ట్విస్ట్‌ను దర్యాప్తు అధికారులు గుర్తించారు. ప్రధాన నిందితుడైన మైనర్ రక్త నమూనా పరీక్ష నివేదికను దర్యాప్తు అధికారులు గుర్తించారు. ప్రధాన నిందితుడైన మైనర్ రక్త నమూనా పరీక్ష నివేదికను ఇద్దరు వైద్యులు మార్చేసినట్టు గుర్తించారు. తాజాగా వారిపై చర్యలు మొదలు పెట్టారు. సాసూన్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ అజేయ్ తావ్‌రే, డాక్టర్ శ్రీహరి హార్నూర్‌ను పుణె క్రైం బ్రాంచి పోలీస్‌లు అరెస్ట్ చేశారు. పుణె లోని ప్రభుత్వ ఆస్పత్రిలో తావ్‌రే ఫోరెన్సిక్ విభాగానికి అధిపతిగా పనిచేస్తున్నారు. ప్రమాదం జరిగిన మొదట్లో అబ్జర్వేషన్ హోమ్‌లో ఉన్న నిందితుడు (మైనర్) రక్త నమూనాల్లో ఎటువంటి ఆల్కహాల్ ఆనవాళ్లు లేవని నివేదిక ఇచ్చారు. కానీ పోలీస్‌లు అనుమానంతో సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా, నిందితుడు మిత్రులతో కలిసి మద్యం తాగినట్టు ధ్రువీకరించుకొన్నారు. దీంతో డాక్టర్లను అదుపు లోకి తీసుకున్నారు. రక్త పరీక్షల సమయంలో మైనర్ నమూనాలను పారేసి, మరో వ్యక్తి నమూనాలను వీరు అక్కడ పెట్టినట్టు అనుమానిస్తున్నారు.

ఇప్పటికే ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పుణె పోలీస్‌లు కూడా తీవ్రంగా పరిగణించారు. దర్యాప్తు సమయంలో నగర కమిషనర్ అమితేష్ కుమార్ మాట్లాడుతూ “ ఇదేదో మద్యం మత్తులో చేసిన యాక్సిడెంట్ కేసు కాదు. నిందితుడైన మైనర్‌కు తాను పార్టీ చేసుకొంటూ ఆల్కహాలు తాగిన విషయం తెలుసు. అలాంటి పరిస్థితుల్లో కారు నడిపితే రోడ్డుపై వారి ప్రాణాలకు ప్రమాదమన్న విషయంపై అతడికి పూర్తి అవగాహన కూడా ఉంది ” అని పేర్కొన్నారు. గత ఆదివారం చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం బాలుడికి జువైనల్ కోర్టు కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేయడంపై విమర్శలు రావడంతో జువెనైల్ బోర్టు తీర్పును సవరించింది.బాలుడ్ని అబ్జర్వేషన్ హోమ్‌కు పంపించింది. నిందితుడి తండ్రి, రెండు బార్‌ల సిబ్బందిని పోలీస్‌లు అరెస్ట్ చేశారు. కొందరు పోలీస్‌లను ప్రభావితం చేసినట్టు ఆరోపణలు రావడంతో ఇద్దరు అధికారులపై వేటు వేశారు. ఇప్పుడు తాజాగా ఫోరెన్సిక్ పరీక్షలు చేసే వైద్యులు కూడా రక్త నమూనాలను తారుమారు చేయడానికి యత్నించినట్టు తేలడం ఆందోళనకరంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News