Sunday, February 23, 2025

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే వేడుకలు

- Advertisement -
- Advertisement -

రఘునాథపల్లి : లయన్స్ క్లబ్ ఆఫ్ రఘునాథపల్లి స్టేషన్ నూతన అధ్యక్షులు పండి శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ డాక్టర్స్ దినోత్సవ సందర్భంగా శనివారం స్థానిక పీహెచ్‌సీలో డాక్టర్లను సన్మానించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పం డ్లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం విజయ దుర్గామాత ఆలయం ప్రాంగణంలో మొక్కలు నాటడం, ఉచిత డయాబెటిక్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు.

అదే విధంగా క్లబ్‌లో ఊతన సభ్యులు మణిరాజ్, కరుణాకర్ చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ లీడర్స్ పూర్వ అధ్యక్షులు కూరెళ్ల ఉపేందర్‌గుప్త, సీనియర్ లయన్ శంకరయ్య, కందుల అనిల్‌కుమార్, లక్ష్మణ్, క్లబ్ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, కోశాధికారి కె.ప్రదీప్, కె.రాజు, నవీన్‌కుమార్, బచ్చు శ్రీనివాస్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News